BRS: తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టుల్లో నిర్మాణ, నాణ్యత లోపాటు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికల వేళ.. వాస్తవాలు వెలుగులోకి రావడం బీఆర్‌ఎస్ సర్కార్‌కు మింగుడు పడడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజీ నాణ్యత లోపాలు బయటపడి వివాదస్పదం కాగా.. తాజాగా కరీంనగర్‌లో ప్రతిష్టత్మకంగా చేపట్టిన తీగల వంతెన నాణ్యత లోపం సైతం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇవి బయటకు వచ్చినవే.. బయట పడని లోపాలు అనేకం ఉన్నాయి. ఇవి ఎక్కడ తమ పుట్టి ముంచుతాయో అని ఆందోళన చెందుతున్నారు.
రూ.లక్ష కోట్ల కాళేశ్వరం..
తెలంగాణలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మాంచామని మొన్నటి వరకు గొప్పటు చెప్పుకున్నారు అధికార గులాబీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైందని ప్రచారం చేసుకున్నారు. నేషనల్ జియోగ్రాఫి చానెల్‌లో గంట ప్రోగ్రాం కూడా టెలీకాస్ట్ చేయించుకున్నారు. కానీ, ప్రాజెక్టు ప్రారంభించిన నాలుగేళ్లకే నిర్మాణ లోపం బయటపడింది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ప్రాజెక్టుపై ఇంతకాలం బీఆర్‌ఎస్ చేసుకున్న ప్రచారం ఉత్తదే అన్న భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో విపక్షాలు చేస్తున్నట్లు ఇది భారీ కుంభకోణం అన్న ఆరోపణలు నిజమే అన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ తీగల వంతెన అంతే..
ఇక కరీంనగర్‌పట్టణ శివారులో మానేరు నదిపై ప్రభుత్వం రూ.181 కోట్ల అంచనాతో 2017 డిసెంబర్‌లో తీగల వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి సుమారుగా ఐదేళ్లు పట్టింది. నిర్మాణ సమయం ఆలస్యం కావడంతో అంచనా వ్యయం సైతం పెరిగింది. వంతెన నిర్మాణ వ్యయం రూ.224 కోట్లతో పూర్తి చేశారు. ఈ ఏడాది జూన్‌లో కరీంనగర్ తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌ప్రారంభించారు. అయితే, వంతెన నిర్మాణం పూర్తి అయిన నెల రోజుల వ్యవధిలోనే నాణ్యత లోపాలు బయపడ్డాయి. వంతెన సైడ్‌వాల్‌కు పగుళ్లు రావడంతోపాటు తారు లేచిపోవడం వంటివి కనిపించాయి. విషయం బయటికి రావడంతో తాత్కలికంగా మరమత్తులు చేశారు.
తాజాగా పగుళ్లు..
వంతెన ప్రారంభించిన నాలుగు నెలల సమయంలో తారు పూర్తిగా లేచి పోయింది. రోడ్డు బీటలు వారింది. దీంతో వంతెనపై ప్రయాణం తీవ్ర ప్రమాదంగా మారింది. తారు లేచిపోవడంతో పట్టణ ట్రాఫిక్‌పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా బీఆర్‌ఎస్ నేతలు, మంత్రి గంగుల ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దక్షణాదిలో అతిపెద్ద వంతెన
కరీంనగర్‌లో నిర్మించిన తీగలవంతెన ప్రారంభం కావడంతో దక్షణ భారతదేశంలో అతి పెద్ద తీగల వంతెనగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రెండు తీగల వంతెనల నిర్మాణం చేయగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై ఒకటి, రెండవది కరీంనగర్‌లో నిర్మించారు. కరీంనగర్‌లో నిర్మించిన తీగల వంతెనతో పర్యటకానికి కొత్త శోభ వస్తుందని భావించగా.. ఎన్నికలవేళ నాణ్యత లోపాల కారణంగా ప్రభుత్వం ఆబాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది..