Tier 1 Telugu Heroes: నిజానికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఉన్న గుర్తింపు మీడియం రేంజ్ హీరోలకైతే ఉండదు. ఒక హీరో స్టార్ హీరోగా మారాలంటే ఏం చేయాలి టైర్ వన్ హీరోగా గుర్తింపును పొందాలి అంటే ఎలాంటి సక్సెస్ లను సాధించాలనే విషయం మీద సరైన క్లారిటి లేదు. నిజానికి ఒక హీరో తన ఎంటైర్ కెరియర్ లో కనీసం ఒక్కసారైనా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాని చేసినప్పుడు అతను టైర్ వన్ హీరోల లిస్టులో చేర్చుకుంటాడు.
అలాగే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో విజయాలను అందుకున్న వాళ్లు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకుంటారు… అలా కాకుండా సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని సాధించినంత మాత్రాన ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగానే కొనసాగుతారు తప్ప టైర్ వన్ హీరోల ప్లేస్ కి చేరుకోలేరు. ఇక సూపర్ సక్సెస్ ని సాధించాలనుకున్న ప్రతిసారి కొంతమంది సక్సెస్ ల దగ్గరే ఆగిపోతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేకయ్యే సినిమా కథలను ఎంచుకొని చేసినప్పుడే వాళ్లని ప్రేక్షకులు అదిరిస్తారు. అలాగే వాళ్లకు ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు లభిస్తుంది. తద్వారా టైర్ వన్ హీరోలుగా మారతారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టైర్ వన్ హీరోల లిస్ట్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు మాత్రమే ఉన్నారు…
ఇక వీళ్ల తర్వాత టైర్ వన్ హీరోల లిస్టులో చేరే హీరోలు ఎవరు అనే విషయంలో సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చేస్తున్న స్టార్ హీరోలందరు టైర్ వన్ హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఒక్కసారి టైర్ వన్ హీరోగా మారితే వాళ్ల మార్కెట్ భారీగా పెరుగుతుంది. అలాగే వాళ్ళ రెమ్యూనరేషన్స్ తీసుకోవడానికి అవకాశాలుంటాయి…