Thug Life vs Indian 2 Collections : కమల్ హాసన్(Kamal Haasan), శింబు(Silambarasan TR) కాంబినేషన్ లో మణిరత్నం(Maniratnam) దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియన్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇలాంటి సినిమాలకు మన ఇండియన్ ఆడియన్స్ కంటే ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడం ఇది వరకు మనం ఎన్నోసార్లు చూసాము. ఈ చిత్రానికి కూడా తమిళనాడు కంటే ఓవర్సీస్ లోనే అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఉదాహరణకు మొదటి రోజు తమిళనాడు లో 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ఓవర్సీస్ లో 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా రెండింతలు ఎక్కువ వసూళ్లు అన్నమాట.
ఓవరాల్ గా ఈ సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని చూస్తుంటే ‘ఇండియన్ 2’ కంటే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేలా అనిపిస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇండియన్ 2 చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు మూడింతల వసూళ్లు తగ్గిపోయాయి. ఈమధ్యకాలం లో ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ డ్రాప్స్ రావడం అనేది ఎవరూ చూడలేదు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 38 కోట్ల 81 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజున కేవలం 13 కోట్ల 44 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి రావాలంటే 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. పరిస్థితి చూస్తుంటే కనీసం అందులో 50 శాతం వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఒక్కసారి ప్రాంతాల వారీగా రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లను చూస్తే తమిళనాడు లో 19 కోట్ల రూపాయిలు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 70 లక్షలు,కేరళలో కోటి 6 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇది లో 3 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి నిర్మాత కమల్ హాసన్ అనే విషయం మనకి తెలిసిందే. నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్న కమల్ హాసన్ ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాడు. మూడు సినిమాలకు కలిపి వచ్చే లాభాలను ఈ ఒక్క సినిమాతో పోగొట్టుకున్నాడు.