Thudaram Movie : రీసెంట్ గానే మోహన్ లాల్(Mohanlal) ‘L2: ఎంపురాన్’ చిత్రం తో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరికీ తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, సీక్వెల్ క్రేజ్ కారణంగా 260 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలై కనీసం నెల రోజులు కూడా పూర్తి కాలేదు, అప్పుడే మోహన్ లాల్ హీరో గా నటించిన మరో చిత్రం ‘తుడారం'(Thudaram Movie) థియేటర్స్ లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కించారో కూడా ఐడియా లేదు. అంత సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టించింది అనే చెప్పాలి. విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన బాహుబలి..మరోసారి చరిత్ర సృష్టిస్తుందా?
మొదటి రోజు ఈ చిత్రం పై అంచనాలు పెద్దగా లేకపోవడం వల్ల, వరల్డ్ వైడ్ గా కేవలం 16 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ పాజిటివ్ టాక్ భీభత్సంగా ఉండడం తో రెండవ రోజు ఏకంగా 24 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 70 శాతం వసూళ్లు పెరిగాయి అన్నమాట. ఇక మూడవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది. కాకపోతే ఒక పాతిక లక్షలు ఎక్కువ వచ్చాయి. ఓవరాల్ గా మూడు రోజులకు గాను ఈ చిత్రానికి 65 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ‘L2: ఎంపురాన్’ మొదటి రోజు వసూళ్లకంటే తక్కువ కానీ, లాంగ్ రన్ లో మాత్రం ఎంపురాన్ కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో చూస్తే, కేరళ నుండి మూడు రోజుల్లో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక లో 3 కోట్ల 40 రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల 15 లక్షలు, మన తెలుగు రాష్ట్రాల నుండి కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ ఈమధ్య కాలం లో కేరళ చిత్ర పరిశ్రమ లో రాలేదని, సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి గంటకు 15 వేలకు పైగా టికెట్స్ బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతుందని అంటున్నారు. చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయిల మార్కుని అందుకునేలా ఉంది.
Also Read : కన్నడలో టాప్ హీరోయిన్.. తెలుగులో మాత్రం కలిసి రాని అదృష్టం..