https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రాబోతుంది ఎవరంటే…

Pushpa Movie: ‘పుష్ప’ సినిమాతో కొద్దిరోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది కూడా సాలిడ్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొదటి భాగం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 09:18 PM IST
    Follow us on

    Pushpa Movie: ‘పుష్ప’ సినిమాతో కొద్దిరోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది కూడా సాలిడ్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.

    ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు ముఖ్య అతిథులు పాల్గొనబోతున్నారట. ఈ వేడుకకు బన్నీ ప్రభాస్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే… అల్లు అరవింద్ తన హిందీ సినిమా ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్‌ని ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నాడట. వీరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ గ్యాప్ చూసుకుని గెస్ట్ గా హాజరుకాబోతున్నట్లు వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ ఏడాది జరిగే అతి పెద్ద పంక్షన్ గా ఈ ఈవెంట్ నిలిచిపోతుంది.

    ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అలానే కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.