Pushpa Movie: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అదిరిపోయిన పుష్ప ట్రైలర్..

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 6, 2021 9:58 pm
Follow us on

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ‘పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

అయితే తాజాగా బన్నీ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది మూవీ యూనిట్. తాజాగా ‘పుష్ప’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో  అల్లు అర్జున్ అదరగొట్టాడు. ముఖ్యంగా విజువల్స్, అడవిని బాగా చూపించారు. డైలాగ్ లు కూడా దుమ్ములేపారు. ఎప్పటి నుంచో ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ అభిమానులకు ఈ వీడియో తో సుకుమార్ ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.  అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు స్టెప్పులేయనుంది. ఇప్పుడు ఈ వీడియోతో ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://twitter.com/PushpaMovie/status/1467883573218738179?s=20