NTR Career: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఆయన కెరియర్ లో చేసిన చాలు సినిమాలు ఆయన గొప్ప విజయాలను అందించనవే కావడం విశేషం…నిజానికి రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి సూపర్ సక్సెలను అందించాయి. ఒక రకంగా ఆ సినిమాలు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయనే చెప్పాలి. స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ , త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో ఎన్టీఆర్ గొప్ప విజయాలను నమోదు చేశాడు. ఇక ఈ సినిమాలన్నీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవే కావడం విశేషం…ఒక రకంగా ఎన్టీఆర్ కెరియర్ నిలబడ్డానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. ఇక రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ కెరియర్ ను నిలబెట్టిన దర్శకులలో వినాయక్ తన తర్వాత స్థానంలో ఉంటాడు. ఆది, సాంబ, అదుర్స్ లాంటి సినిమాలతో ఎన్టీఆర్ ను టాప్ లెవల్లో నిలబెట్టాడు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి లిరికల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది..సంచలన అప్డేట్ చెప్పిన హరీష్ శంకర్!
ఒకానొక సమయంలో ఎన్టీఆర్ కెరియర్ డౌన్ ఫాల్ అయిపోతోంది అనే సందర్భంలో అదుర్స్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించి తన కెరీర్ ని టాప్ రేంజ్ లో దూసుకుపోయేలా చేశాడు. ఇక ఆ తర్వాత ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ను కట్టబెట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా కావడం విశేషం…
ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విలన్ క్యారెక్టర్ కి భారీ డామేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వరుసగా జూనియర్ ఎన్టీఆర్ ప్లాప్ లను మూటగట్టుకుంటున్న సందర్భంలో పూరి ‘టెంపర్’ లాంటి ఒక సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాతో అతనికి భారీ కంబ్యాక్ ఇచ్చాడు. తనకు కట్టబెట్టి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి తిరుగులేదనెంతలా పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ని హైలైట్ చేసి చూపించాడు.
ఒకరకంగా ఈ ముగ్గురు దర్శకుల వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ లెవల్లో నిలిచాడు. వీళ్ళు ముగ్గురు కనక లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ఎప్పుడో డౌన్ ఫాల్ అయిపోయేదని చాలా మంది సినిమా మేధావులు సైతం చెప్తూ ఉంటారు…చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనేది…