Yasha Sagar: ఆమె అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టుగానే శరీర సౌష్టవం కూడా ఉంటుంది. సహజంగా అందంగా ఉన్న అమ్మాయిల గొంతు శ్రావ్యంగా ఉండదు. కానీ ఈ అమ్మాయికి అందంతోపాటు గొంతు శ్రావ్యతను కూడా ఇచ్చాడు. దీంతోపాటు ఆమె హిందీ నుంచి మొదలుపెడితే ఇంగ్లీష్ వరకు అనర్గళంగా మాట్లాడుతుంది. సమయానికి తగ్గట్టుగా స్పాంటేనిటి ప్రదర్శిస్తుంది. అందువల్లే ఆమె అంటే చాలామంది అభిమానిస్తారు. ఆమె మాట్లాడుతుంటే అలానే చూస్తూ ఉండిపోతారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆమె మనదేశంలో గొప్ప ప్రజంటర్లలో ముందు వరుసలో ఉంది..
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి లిరికల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది..సంచలన అప్డేట్ చెప్పిన హరీష్ శంకర్!
అంతటి గొప్ప ప్రజంటర్ పేరు యషా సాగర్.. పేరుకు తగ్గట్టుగానే సాగరమంతటి ఉత్సాహం ఈమె సొంతం. ఐపీఎల్ నుంచి మొదలుపెడితే ఎన్నో పెద్ద పెద్ద టోర్నీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. గొప్ప గొప్ప క్రికెటర్లతో కూడా సంభాషించింది. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. అందువల్లే ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెను లక్షలాదిమంది అనుసరిస్తున్నారు. అనేక ప్రవేట్ కంపెనీలకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. అయితే అటువంటి యషా సాగర్ ఇటీవల బంగ్లాదేశ్లో ఓ ప్రీమియర్ లీగ్ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి వెళ్లింది. వాస్తవానికి వెళ్ళిన ప్రతిచోట అభిమానులను సంపాదించుకోవడం.. వారితో మమేకం కావడం యషా సాగర్ కు అలవాటు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విధంగా మాట్లాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ లో ఎదురైన అనుభవం ఆమెకు జీవితకాల గుణపాఠం నేర్పింది.
బంగ్లాదేశీయులలో చాలామంది మూర్ఖంగా ఉంటారు. ఇక అమ్మాయిల విషయంలో వారి ప్రవర్తన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యషాను హోస్ట్ గా రమ్మని పిలిచిన నిర్వహకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారట. అన్నిటికంటే ముఖ్యంగా కోరినంత డబ్బు ఇస్తాము…పడక సుఖం అందించు అన్నారట. దానికి ఆమె ముందుగా షాక్ అయింది. ఆ తర్వాత తేరుకుంది. చివరికి ఇలాంటి వ్యక్తులను తెలిస్తే తాను వచ్చేదానిని కాదని మొహమాటం లేకుండా చెప్పేసింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా.. తన సమాధానాన్ని మరో విధంగా చెప్పి ఆమె బయటకు వచ్చేసింది. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థతో పంచుకుంది. ఆ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. వాస్తవానికి బంగ్లాదేశ్లో క్రికెట్ కు ఆదరణ ఉన్నప్పటికీ.. అక్కడ నిర్వాహకులు చెత్తబుద్దిని ప్రదర్శిస్తారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి యషా చెప్పిన మాటలతో అది నిజమైంది.
View this post on Instagram