Director Maruthi House: ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్ర డైరెక్టర్ మారుతీ పై బయ్యర్స్ లో ఇసుమంత నమ్మకం లేకపోయినప్పటికీ, ప్రభాస్ స్టార్ స్టేటస్ మీద నమ్మకం పెట్టి, ఫ్యాన్సీ ప్రైజ్ తో ప్రతీ సెంటర్ లోనూ ఈ సినిమాని కొనుగోలు చేశారు. కానీ మొదటి ఆట నుండే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం తో, కలెక్షన్స్ పై చాలా బలమైన ప్రభావం పడింది. ప్రభాస్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వరకు ఈ చిత్రం నెట్టుకొచ్చింది. మొదటి వీకెండ్ ముగిసిన తర్వాత కలెక్షన్స్ లో దారుణమైన డ్రాప్స్ నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి తప్ప, సంక్రాంతికి విడుదలైన పతీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో ‘రాజా సాబ్’ ని జనాలు పట్టించుకోవడం మానేశారు.
ఫలితంగా వంద కోట్ల రూపాయలకు పైగా నష్టాలు ఈ చిత్రానికి వాటిల్లాయి. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ మారుతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఈ సినిమా పై అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. అదేమిటంటే ‘ప్రభాస్ ని ఇష్టపడే ప్రతీ ఒక్కరు, ఈ సినిమాని చూసి నిరాశ చెందరు, అందుకు నేను హామీ ఇస్తున్నాను, ఒకవేళ మీలో ఎవరైనా నిరాశకు గురైతే హైదరాబాద్, ‘Kolla Luxoria’ లో ఉంటాను, వచ్చేయండి’ అంటూ ఫ్లాట్ నెంబర్ తో సహా చెప్పేసాడు డైరెక్టర్ మారుతీ. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతీ రోజు ఆయన ఫ్లాట్ కి వందల సంఖ్యలో లెటర్స్ పంపిస్తూనే ఉన్నారట. ఇది డైరెక్టర్ మారుతీ కి ఆయన కుటుంబానికి నరకమయం గా తయారైంది అట. ట్విట్టర్ లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా రన్ పూర్తి అవ్వడం తో, డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి చెప్పుకోలేని భాషలో అడ్డమైన బూతులు తిడుతున్నారు.
ఎదో పెద్ద కళాఖండం తీసినట్టు ఏ ధైర్యం తో మారుతీ అలా తన ఇంటి అడ్రస్ ని ఫ్లాట్ నెంబర్ తో సహా ఇచ్చాడు. తానూ తీసిన సినిమా పై ఆ రేంజ్ నమ్మకం ఉండడం లో తప్పు లేదు, కానీ ఆయన తీసిన సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా?, తేడా జరిగితే అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో తెలిసి కూడా ఎందుకు మారుతీ ఇలాంటి పని చేసాడు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. తానూ రిస్క్ లో ఉండడం లో తప్పు లేదు , ఇప్పుడు అడ్రస్ ని లీక్ చేసి కుటుంబాన్ని మొత్తం రిస్క్ లో పెట్టాడు అంటూ తిడుతున్నారు విశ్లేషకులు.