Ravi Teja: సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మహేష్ బాబు చేసిన ఒకటి రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. రాఘవేంద్ర రావు తో చేసిన రాజకుమారుడు సినిమా హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత చేసిన వంశీ, బాబీ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు సినిమా చేశాడు.
ఈ సినిమా మహేష్ బాబు కెరీయర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా లవ్ అండ్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇక ఇది సూపర్ సక్సెస్ అవడంతో టాలీవుడ్ లో అప్పుడు ఇలాంటి కథలకి డిమాండ్ పెరిగింది. అందులో భాగంగానే చాలామంది దర్శకులు ఇలాంటి కథలని రెడీ చేసుకొని సినిమాలు చేశారు. ముఖ్యంగా ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అనే పాయింట్ ని బేస్ చేసుకొని ఒక్కడు సినిమా వచ్చింది. ఇక అదే పాయింట్ తో రవితేజ హీరోగా వచ్చిన వెంకీ, భద్ర లాంటి సినిమాలు కూడా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
వీటి ట్రీట్ మెంట్ లో తేడా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది… ఇక వెంకీ సినిమాలో అయితే రవితేజ హీరోయిన్ స్నేహా ను తీసుకొచ్చి ఒక ప్లేస్ లో దాచి పెడతాడు. ఇక ఒక్కడు సినిమాలో కూడా మహేష్ బాబు హీరోయిన్ ను తీసుకొచ్చి చార్మినార్ లో దాచి పెడతాడు. అయితే ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే దాని స్పూర్తితో అలాంటి సినిమాలు చాలానే వస్తాయి. కానీ రవితేజ హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా అదే ఫ్లేవర్ తో రావడం అనేది అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది…
ఇక భద్ర సినిమా అయితే రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. రవితేజ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటి ఉంటుంది. అలాగే ఆయన కెరియర్ లో టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా కూడా నిలుస్తుంది. ఇక మొత్తానికైతే ఒక్కడు సినిమా స్ఫూర్తి తో వచ్చిన రెండు కథలతో రవితేజ హిట్లు కొట్టడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…