Samantha- Varalakshmi: సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన నేపథ్యంలో నటి వరలక్ష్మి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. యశోద మూవీలో వీరిద్దరూ కలిసి నటించగా, ఆ చిత్ర షూటింగ్లో సమంత ఎలా ఉన్నారనే విషయం తెలియజేశారు. వరలక్ష్మి సమంత ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశిస్తూ… సామ్ తో నాకు 12 ఏళ్లకు పైగా పరిచయం ఉంది. చెన్నైలో మేము మొదటిసారి కలిశాము. యశోద మూవీలో సమంతతో కలిసి నటించడం సంతోషాన్ని కలిగించింది. ఆ చిత్ర షూటింగ్ నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. సామ్ నేను చెన్నైలో జరిగిన ఒకప్పటి విషయాలు గుర్తు చేసుకొని నవ్వుకునేవాళ్ళం.

యశోద షూటింగ్ సమయానికి ఆమెకు మయోసైటిస్ సోకిన విషయం తెలియదు. ఎందుకంటే ఆమె చాలా ఎనర్జిటిక్ గా కనిపించేవారు. అనారోగ్యంతో బాధపడుతున్న దాఖలాలు అసలు కనిపించలేదు. ఒకవేళ యశోద షూటింగ్ తర్వాత ఆమె ఈ వ్యాధి బారిన పడి ఉండవచ్చు. సమంత గొప్ప ఫైటర్. ఈ సమస్య నుండి ఆమె తప్పకుండా బయటపడతారు…. అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.
దీంతో సమంతకు మయోసైటిస్ యశోద షూటింగ్ పూర్తయ్యాక సోకి ఉండవచ్చు. ఒకవేళ అప్పటికే సమంతకు ఆ విషయం తెలిసినా బయటపెట్టికి ఉండకపోవచ్చు. కేవలం మూడు రోజుల క్రితం సమంత ఈ విషయాన్ని బయటపెట్టారు. చేతికి సెలైన్ పెట్టి ఉండగా సమంత యశోద చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేసి, తాను మయాసైటిస్ తో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించారు.

సమంత ఆరోగ్య పరిస్థితిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇక మరో వారంలో సమంత నటించిన యశోద విడుదల కానుంది. నవంబర్ 11న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సరోగసీ అంశం ప్రధానంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ఇక సమంత హీరోయిన్ గా తెలుగులో శాకుంతలం, ఖుషి తెరకెక్కుతున్నాయి.