Tollywood Movies Business: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తున్న మన స్టార్ హీరోలందరు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. అలాగే బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మన వాళ్ళు ముందు వరుసలో దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరికి లేనటువంటి గొప్ప విజయాలను సాధిస్తున్న మన హీరోలందరు ఈ సంవత్సరం కూడా మ్యాజిక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి నటులు ఈ సంవత్సరం వాళ్ల సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ స్టార్ హీరోలతో పాటుగా మరి కొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక నాని ‘ప్యారడైజ్’ సినిమాతో ముందుకు వస్తున్నాడు.
ఈ హీరోలందరి సినిమాలు కలిసి ఈ సంవత్సరం దాదాపు 4500 కోట్లకు పైన బిజినెసునైతే చేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బిజినెస్ చేస్తున్న సినిమాలుగా మన తెలుగు సినిమాలు గుర్తింపును సాధించడంతో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకుందనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది కీలకమైన అంశంగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే సినిమాల విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన కూడా మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి ముందుకెళ్తే మంచిదని సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట మన నుంచి రాబోతున్న సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…చూడాలి మరి రాబోయే సినిమాలతో మనవాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…