https://oktelugu.com/

ఒక్కసారికే.. ఐటమ్ అయిపోతానా: రెజీనా

రెజీనాను కుర్రకారులో భారీ క్రేజీ ఉంది. ఈ అమ్మడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ చిరంజీవి పక్కన హీరోయిన్ కాదు.. ఒక స్పెషల్ సాంగ్లో ఆయన పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది. చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కోసం రెజీనాను సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే రామోజీ ఫిల్మీ సిటీలో చిరంజీవి-రెజీనాలపై ఓ మాస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 13, 2020 / 06:01 PM IST
    Follow us on


    రెజీనాను కుర్రకారులో భారీ క్రేజీ ఉంది. ఈ అమ్మడి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ చిరంజీవి పక్కన హీరోయిన్ కాదు.. ఒక స్పెషల్ సాంగ్లో ఆయన పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది. చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కోసం రెజీనాను సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే రామోజీ ఫిల్మీ సిటీలో చిరంజీవి-రెజీనాలపై ఓ మాస్ బీట్ సాంగ్ చిత్రీకరించారు.

    తాజాగా రెజీనా చిరు పక్కన నటించిన ఐటమ్ సాంగ్ పై స్పందించింది. మెగాస్టార్ పక్కన డాన్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్‌ అనగానే ఆలోచించకుండా ఒప్పుకున్నాన్నట్లు చెప్పింది. ఈ సాంగ్‌లో నటించినందుకు మాత్రం తనను ఐటమ్‌ అనవద్దని.. ఈ సాంగ్‌ను కూడా ఐటమ్‌ సాంగ్‌ అని పిలవద్దని విజ్ఞప్తి చేసింది. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ సాంగ్ చెబుతుంది. మెగాస్టార్ తన తన డాన్స్‌ను మెచ్చుకున్నారని అమ్మడు మురిసిపోతుంది.

    ‘ఆచార్య’ మూవీలో చిరుకు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. ఇందులో తెలుగమ్మాయి ఈషారెబ్బా, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్లో ఈ మూవీని మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. చిరంజీవి మూవీ మణిశర్మ చాలా ఏళ్ల తర్వాత సంగీతాన్ని సమకురుస్తున్నాడు.