Bappi Lahiri: బప్పీలహిరి తన సంగీతంతో భారతదేశంలోనే కాకుండా అంత ర్జాతీయంగా కూడా తనదైన ముద్ర వేశారు. 1980,1990ల్లో బప్పీలహిరి పాటలు అప్పట్లో యువతనేకాకుండా చిన్నారులను పెద్దలను అందరినీ ఓ ఊపు ఊపాయి. ఐదు దశాబ్దాలకుపైగా తన కెరీర్‌లో లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ వంటి ప్రఖ్యాత గాయకులతో పాటు లేడీ గాగా, ఎకాన్ వంటి అంతర్జాతీయ తారలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. బప్పీలహిరి గురించి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ నేపథ్యం…

బప్పీలహిరి అసలు పేరు అలోకేష్ లహిరి. అందరూ అలోకేష్ అని పిలుస్తుండేవాళ్లు. నవంబర్ 27న,1953లో కోల్ కత సాంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించారు. ఆయన సంగీత ప్రయాణం కోల్ కతలో మొదలైంది. బప్పీలహిరి తన 3వ సంవత్సరంలోనే తబలా వాయించడం ప్రారంభించారు. బప్పీలహిరి తన తల్లిదండ్రులు అపరేష్ , బాన్సూరి లాహిరిల వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. మేనమామ ప్రముఖ గాయకులు కిషోర్ కుమార్. ఈయనతో జఖ్మీ (1975), చల్తే చల్తే (1976) ‘ఇంతేహా హో గయీ’ వంటి అనేక ఆల్బమ్‌లకు కలిసి పనిచేశారు బప్పీలహిరి.
డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన సింగర్…

బప్పీలహరి తల్లి బన్సూరి తండ్రి ఆపరేశ్..కాగా వీరిద్దరూ గాయకులు కావడంతో పాటు వీళ్లకు ఈయనొక్కరే సంతానం కావడంతో ఆయన్ను చిన్నపటినుంచి అల్లారు ముద్దుగా పెంచారు. బప్పీలహరికి ఇద్దరు పిల్లలు. కొడుకు బప్పాలహిరి, కుమార్తె రీమా లహిరి. 1973లో నన్హా షికారితో బప్పీలహరి సినిమా ప్రయాణం మొదలయ్యింది. కెరీర్ ప్రారంభంలోనే జక్మీ, చల్తే చల్తే, సురక్షా, ఆప్ కి ఖాతిర్, వర్దాత్, టూటే ఖిలోనే లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. తనదంటూ ఒక ముద్ర వేశారు. 1982లో వచ్చిన “డిస్కో డ్యాన్సర్” బాలీవుడ్ సినిమా బప్పీలహిరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

1986 సంవత్సరంలో 180 కంటే ఎక్కువ పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు లభించింది. మొత్తం 479 చిత్రాలకు సంగీతం అందించారు. బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన సింగర్ కూడా బప్పీలహిరి నే. తన సంగీతాన్ని కాపీ చేసినందుకు అమెరికన్ R&B సింగర్ ట్రూత్ హర్ట్స్‌పై దావా వేసాడు. లాహిరి పాట ‘తోడా రేషమ్ లగ్తా హై’ బిట్స్ ట్రూత్ హర్ట్స్ ‘అడిక్టివ్’లో ఉపయోగించగా.. లాస్ ఏంజెల్స్ కోర్టులో బప్పీలహిరికి అనుకూలంగా తీర్పునిచ్చిన సారెగామా బృందం ఆయనపై దావా వేసింది. బప్పిలహిరికి క్రెడిట్ ఇచ్చే వరకు పాటల సీడీల అమ్మకాలు అన్నీ ఆగిపోయాయి.

Also Read: Ballaya Vs Star Heroine: బాలయ్య కి వెన్నుపోటు పొడిచిన స్టార్ హీరోయిన్
రోల్ మోడల్ ఎవరంటే..?
‘జిమ్మీ జిమ్మీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది
డిస్కో డాన్సర్‌లోని ‘జిమ్మీ జిమ్మీ’ అనే పాట బప్పీలహిరికి అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు తెచ్చిపెటింది. ఇది హాలీవుడ్ చిత్రం యు డోంట్ మెస్ విత్ ది జోహాన్ కోసం పునర్నిర్మించారు. ఈ పాట సినిమా చివరిలో ప్రదర్శించారు.
మైఖేల్ జాక్సన్ కూడా ఈ పాటకు అభిమానిగా మారారు.
బప్పిలహిరికి 75 కిలోలపైగా బంగారు ఆభరణాలు ఉన్నాయి.
బంగారమే తన అదృష్టమని ఆయన నమ్మేవారు. అందుకే ఆయన బంగారు గొలుసులు, కంకణాలు ,ఉంగరాలు ధరిస్తుండేవారు. 2021లో ఆయన ధన్‌తేరాస్‌లో గోల్డ్ టీ సెట్ (కప్పు, సాసర్ లు ) కొన్నారు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’లో ఒక ప్రదర్శనలో బప్పిలహిరి తనకు అమెరికన్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా నచ్చుతుందని చెప్పారు. తన డ్రెస్సింగ్ కు ఆయనే రోల్ మోడల్ అని వెల్లడించారు. బప్పిలహిరి 69 సంవత్సరాల వయస్సులో ఫిబ్రవరి 15న ముంబైలో కన్ను మూశారు. క్రిటికేర్ హాస్పిటల్‌లోని లాహిరి అనేక ఆరోగ్య సమస్యలతో నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు.
Also Read: CM Jagan On Meters: ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తేస్తారా? వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు

[…] Also Read: Bapila Hari: సంగీతప్రపంచంలో ఓ సంచలనం మ్యూజిక… […]
[…] Also Read: Bapila Hari: సంగీతప్రపంచంలో ఓ సంచలనం మ్యూజిక… […]