Chiranjeevi: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొన్ని క్యారెక్టర్లు డిజైన్ చేయించుకుని అలాంటి క్యారెక్టర్లు చేయాలి అనే ఉద్దేశంతో చాలా సినిమాలు అలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోలు అయితే డైరెక్టర్లు, రైటర్లు అందరు వాళ్ళకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్లకి నచ్చినట్టుగా స్టోరీ ని రెడీ చేయించుకుని సినిమాలు తీస్తూ ఉంటారు. చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ సినిమాగా చేస్తే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ అభిప్రాయపడడంతో చిరంజీవి కూడా ఒకే అన్నాడు అప్పుడు ఈ సినిమా అనేది స్టార్ట్ అయింది.
దాంతో ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని తీసుకుందాం అని అనుకున్నప్పుడు అంతకుముందే రామ్ చరణ్ తో ధృవ అనే సినిమా తీసి మంచి సక్సెస్ ని అందుకున్న సురేందర్ రెడ్డి చిరంజీవికి కనిపించాడు దాంతో సురేందర్ రెడ్డిని ఈ సినిమాకి డైరెక్టర్ గా ఫిక్స్ చేసి ఈ సినిమాని తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం చాలా తక్కువ కలెక్షన్ల ను రాబట్టిందనే చెప్పాలి. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ మీద రాంచరణ్ నిర్మించడం జరిగింది. ఇక ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి క్యారెక్టర్ లో చిరంజీవి నటించడం కాదు జీవించాడనే చెప్పాలి. చిరంజీవి ఓ క్యారెక్టర్ చేస్తాను అని ఒప్పుకుంటే దానికోసం 100% ఎఫర్ట్ పెట్టి అయిన సరే ఆ సినిమా లో డైరెక్టర్ ఎలాగైతే కావాలి అనుకున్నాడో అలా ఆ సీన్ అలా వచ్చినంత వరకు ప్రతి దానిమీద చాలా ఎఫర్ట్ పెట్టీ చేస్తాడు…ఈ సినిమా మీద కూడా చాలావరకు తన ఎఫర్ట్ పెట్టి ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికే ఆయన ప్రయత్నం చేశాడు దానికి ఫలితంగా ఈ సినిమాలో ఆయన చాలా అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంశలు కూడా అందుకున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత అతిపెద్ద భారీ సినిమా గా చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా యావరేజ్ గా ఆడి కలెక్షన్స్ కూడా అంత బాగా రాబట్టలేకపోయింది.దాంతో చిరంజీవి ఇంకోసారి భారీ బడ్జెట్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది…