Vijay Deverakonda Rashmika wedding card: ఈ నెల 26న ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరొందిన రష్మిక(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్ పూర్ లో వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి. ఈ పెళ్ళికి కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు. మార్చి 4న హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు కాబోతుంది. రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అయితే వీళ్లిద్దరు ఇప్పటికీ కూడా వీళ్ళ పెళ్లి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. రీసెంట్ గా రష్మిక ముంబై విమానాశ్రయం లో కనిపించగా, రిపోర్టర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలపడం, కానీ ఆమె ‘మీరు దేని గురించి శుభాకాంక్షలు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ అమాయకంగా సమాధానం ఇవ్వడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యి ట్రోల్ అవ్వడం వంటివి నేడు జరిగాయి.
ఇలాంటి సమయం లో వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవ్వడం తో, ఇక మీ అద్భుతమైన నటన ఆపండి, అడ్డంగా దొరికిపోయారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ శుభలేఖ లో పెళ్లి ఈ నెల 26 న కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ చేసుకుంటున్నామని, మార్చి 4 న రిసెప్షన్ ని ఏర్పాటు చేశామని, ఆ రిసెప్షన్ కి తప్పకుండ హాజరు కావాలని ఈ శుభలేఖ లో పేర్కొని ఉంది. మార్చి 4వ తేదీన, హైదరాబాద్ లోని, బంజారా హిల్స్, టాక్ కృష్ణ హోటల్ లో, రాత్రి 7 గంటల నుండి ఈ రిసెప్షన్ కార్యక్రమం మొదలు కాబోతుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారట.
బాలీవుడ్ నుండి కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత, మీడియా లో అంతకు మించిన అటెన్షన్ ని సంపాదించుకున్న పెళ్లి ఏదైనా ఉందంటే, అది విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి మాత్రమే. ఇకపోతే రష్మిక కి గతం లో కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ‘గీతా గోవిందం’ సినిమా షూటింగ్ సమయం లోనే వాళ్ళిద్దరి నిశ్చితార్థం రద్దు అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు విజయ్ దేవరకొండ తో ఈమె డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు వీళ్లిద్దరు ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
పెళ్లి ప్రచారం విషయంలో ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి నోరు మెదపడం లేదు.
కానీ పెళ్లి పిలుపులు మాత్రం జోరందుకొన్నాయి. శుభలేఖ కూడా వైరల్ అవుతోంది.
26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి
మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగబోతున్నాయి.ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా… pic.twitter.com/LHs3yARLH5
— Telugu360 (@Telugu360) February 16, 2026