Sharwanand: శర్వానంద్ స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణం ఇదే…

Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో శర్వానంద్ ఒకరు. మొదట్లో ఈయన సైడ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోల్లో శర్వానంద్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ రావడంతో ఆయన అనుకున్న స్థాయికి అయితే ఆయన ఎదగలేకపోయాడు. ఈయన వెన్నెల, ప్రస్థానం లాంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు అయితే […]

Written By: Suresh, Updated On : November 26, 2023 8:26 am

Sharwanand

Follow us on

Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో శర్వానంద్ ఒకరు. మొదట్లో ఈయన సైడ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోల్లో శర్వానంద్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ రావడంతో ఆయన అనుకున్న స్థాయికి అయితే ఆయన ఎదగలేకపోయాడు.

ఈయన వెన్నెల, ప్రస్థానం లాంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గమ్యం సినిమాతో తన కెరియర్లో మొదటి కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఇక ప్రస్థానం సినిమాలో అతని నటనను చూసిన చాలామంది విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసించారు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు సోలో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి నిలదొక్కుకోలేకపోతున్నాడు ఆయన మంచి నటుడు అయినప్పటికీ సక్సెస్ లు అనుకున్న రేంజ్ లో సాధించలేకపోతున్నాడు. అంటే ఆయన కెరియర్ మొత్తంలో సక్సెస్ సాధించిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.

ఇక రన్ రాజా రన్ సినిమాతో తను టోటల్ గా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాని కూడా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా కూడా హిట్ పడకపోవడంతో ఆయన ప్రస్తుతం మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు. చాలామంది హీరోలు సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు సాగుతూ ఉంటే ఆయన మాత్రం ఇంకా ఒక హిట్టు కొట్టడానికి సతమతమవు తున్నాడు. ఇక ఈయన తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం స్టార్ హీరో లా రేస్ లో ముందుకు దూసుకుపోతుంటే ఈయన ఎప్పటినుంచో అదే మీడియం రేంజ్ లో ఉండిపోతున్నాడు ఒక హిట్ వస్తే రెండు సినిమాలు ప్లాప్ అవడం లాంటి కేటగిరీలోనే ఉంటూ తనకు తాను హీరో గా ఎదగ లేకపోతున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే శర్వానంద్ కి బ్యాక్ టు బ్యాక్ ఒక రెండు, మూడు హిట్స్ పడితే తప్ప ఆయన మళ్లీ మంచి ఫామ్ లోకి రాలేడు… కాబట్టి ఇప్పుడూ ఆయన శ్రీరామ ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మంచి హిట్ సాధిస్తే తప్ప ఆయనకున్న మార్కెట్ ని కాపాడుకోలేడు…ఎంత మంచి నటుడు అయిన కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాళ్ళకి క్రేజ్ అనేది ఉంటుంది అని చెప్పడానికి శర్వానంద్ ను ఉదాహరణగా తీసుకోవచ్చు…