D51: ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ స్టోరీ లీక్…కథేంటంటే..?

సాయి పల్లవి ని లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేసిన ఫిదా సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడమే కాకుండా శేఖర్ కమ్ముల పేరు మరోసారి ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో నిలిచే విధంగా హైప్ ని తీసుకొచ్చాయి.

Written By: Gopi, Updated On : November 26, 2023 9:46 am

D51

Follow us on

D51: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీ లని తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ తో పాటు ఇండస్ట్రీ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల…ఈయన చేసిన సినిమాల్లో ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి సినిమాలు వరుసగా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకొని ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఆ తర్వాత సాయి పల్లవి ని లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేసిన ఫిదా సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడమే కాకుండా శేఖర్ కమ్ముల పేరు మరోసారి ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో నిలిచే విధంగా హైప్ ని తీసుకొచ్చాయి.

ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈయన ధనుష్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ కూడా ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా రహస్యం గా సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇంతకుముందు శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీస్ మాదిరిగానే ఈ సినిమా కూడా లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే పోలీస్ ఆఫీసర్ కి అలాగే ఒక కామన్ లేడీ కి మధ్య జరిగే లవ్ స్టోరీ లోకి విలన్ అనే వాడు ఎంటర్ అవుతాడు వాడికి హీరో కి, హీరోయిన్ కి మధ్య సంబంధం ఏంటి అనే ఒక డిఫరెంట్ కథాంశంతో డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు…ఇక ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు… అలాగే ధనుష్ కూడా ఇంతకుముందు సార్ లాంటి సినిమా తో హిట్ కొట్టినప్పటికి ఒక పెద్ద హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు ఇలాంటి క్రమంలో శేఖర్ కమ్ముల లాంటి ఒక డీసెంట్ డైరెక్టర్ తో ధనుష్ సినిమా చేయడం అనేది ధనుష్ అదృష్టమనే చెప్పాలి…

ఎందుకంటే ఇప్పుడిప్పుడే ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడుతుంది ఇలాంటి సమయంలో శేఖర్ కమ్ముల లాంటి ఒక మంచి డైరెక్టర్ ధనుష్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఇక ఆల్మోస్ట్ ఆయన మార్కెట్ అనేది ఇక్కడ భారీగా పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి…ఇక ఈ సినిమా కనక సక్సెస్ సాధిస్తే ధనుష్ తెలుగు లో వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ సాధించిన కోలీవుడ్ హీరో గా మంచి గుర్తింపు అయితే పొందుతాడు….