Prabhas: ప్రభాస్ సినిమా ని హను రాఘవపూడి హ్యాండిల్ చేయలేడు అనడానికి ప్రూఫ్ ఇదే…

ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే బాహుబలి తర్వాత నుంచి ఆయన చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా నిలుస్తున్నాయి.అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగు లో అంత పెద్దగా సక్సెస్ కానప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Written By: Gopi, Updated On : November 26, 2023 8:24 am

Prabhas

Follow us on

Prabhas: ప్రభాస్ లాంటి ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ గా హీరో అంటే ఎలా ఉండాలి అనేదానికి డెఫినిషన్ ఇచ్చినట్టుగా ప్రభాస్ ఉంటాడు.ప్రస్తుతం ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన ఉంది.నిజానికి బాహుబలి ముందు వరకు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రభాస్ హీరోగా తన సత్తా చాటాడు కానీ బాహుబలి సినిమా తర్వాత ఆయన ఒక్కసారి గా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే బాహుబలి తర్వాత నుంచి ఆయన చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా నిలుస్తున్నాయి.అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగు లో అంత పెద్దగా సక్సెస్ కానప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన రాదే శ్యామ్, ఆదిపురుషు లాంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా మీదనే అందరి అంచనాలు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే హను రాఘవపూడి లవ్ స్టోరీలు బాగా తెరకెక్కిస్తాడు అనే పేరు అయితే ఉంది.ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన గత సంవత్సరం లో తీసిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే హను రాఘవపూడి లవ్ స్టోరీస్ ఎక్కువగా చేస్తాడు కాబట్టి ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయాలను చూసుకుంటే ఆయన ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన రాదే శ్యామ్ సినిమానే ప్రేక్షకులు ఆదరించలేకపోయారు ఎందుకంటే ఆ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా చాలా బ్యాడ్ గా కనిపించాడు. అలాంటిది ఇప్పుడు హను రాఘవపూడి సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ఎంతవరకు సందడి చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇది తెలుసుకున్న ట్రేడ్ పండితులు సైతం ప్రభాస్ హను రాఘవ డైరెక్షన్ లో సినిమా చేయడం వేస్ట్ అంటూ చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఏజ్ కి, ఆయన ఫిట్నెస్ కి ఆయన మాస్ సినిమాలకు అయితేనే సెట్ అవుతాడు.అంతే తప్ప లవ్ స్టోరీస్ చేస్తే ఆయనకి సెట్ అవ్వదు.

కాబట్టి ప్రభాస్ మాస్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తేనే బెటర్ అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక హను రాఘవపూడి కూడా ఇంతకు ముందు తీసిన సినిమాల్లో సీతారామం ని మినహా ఇస్తే ఆయన కి పెద్దగా సక్సెస్ లు లేవు. అందువల్లే ప్రభాస్ ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కరెక్ట్ కాదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నారు…