Agent Movie OTT: ‘ఏజెంట్’ మూవీ ఓటీటీ లో ఇప్పటి వరకు విడుదల కాకపోవడానికి కారణం ఇదా..!

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు అనిల్ సుంకర మధ్య ఏర్పడిన కొన్ని గొడవల కారణం గా సురేందర్ రెడ్డి షూటింగ్ మధ్యలోనే సినిమాని వదిలేసి వెళ్లిపోయాడని. ఆ తర్వాత ఈ చిత్రానికి కథని అందించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం వల్ల ఫైనల్ ఔట్పుట్ అంత చెత్తగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

Written By: Shiva, Updated On : May 30, 2023 12:31 pm

Agent Movie OTT

Follow us on

Agent Movie OTT: అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఈ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 7 కోట్ల రూపాయిలను కూడా వసూలు చెయ్యలేకపోయింది. నిర్మాత ని మరియు అఖిల్ ని ఈ చిత్రం మానసికంగా ఎంతో బాధకి గురి చేసింది.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు అనిల్ సుంకర మధ్య ఏర్పడిన కొన్ని గొడవల కారణం గా సురేందర్ రెడ్డి షూటింగ్ మధ్యలోనే సినిమాని వదిలేసి వెళ్లిపోయాడని. ఆ తర్వాత ఈ చిత్రానికి కథని అందించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం వల్ల ఫైనల్ ఔట్పుట్ అంత చెత్తగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

థియేటర్స్ నుండి వారం లోపే వైదొలగిన ఈ సినిమాని త్వరగా ఓటీటీ లో విడుదల చేద్దాం అనుకున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సోనీ లివ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసి , మే 20 వ తేదీన విడుదల చేస్తామని అధికారిక ప్రకటన కూడా చేసింది.కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. సినిమాని కాస్త ఎడిటింగ్ చేసి, చెత్త న్నివేశాలు మొత్తం తొలగించేసి, మంచి సన్నివేశాలను జతచేసి ఫైనల్ ఔట్పుట్ ఇస్తాము, అప్పుడు అప్లోడ్ చేసుకోండి అని చెప్పాడట. దీనితో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. అసలే డిజాస్టర్ సినిమా, ఇంకా ఆలస్యం చేస్తే చూసే కొద్దీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడడం మానేస్తారేమో అని సోనీ లివ్ సంస్థ భయపడుతుంది.