https://oktelugu.com/

Jayam Movie: జయం సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసి ఉంటే ఆయన రేంజ్ ఇంకా ఎలా ఉండేదో!

అలా తొలిసినిమా తోనే చరిత్ర తిరగరాసి ఇండస్ట్రీ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు నితిన్. ఇక ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో గోపీచంద్ కూడా ఒకడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 30, 2023 / 12:34 PM IST

    Jayam Movie

    Follow us on

    Jayam Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన క్లాసికల్ లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలను ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టడు. అలాంటి చిత్రాలలో ఒకటి ‘జయం’. యంగ్ హీరో నితిన్ ఈ చిత్రం ద్వారా హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో వసూళ్లు పరంగా చరిత్ర తిరగరాసింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో అయితే ఈ చిత్రం ఏకంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘ఖుషి’ కలెక్షన్స్ ని కూడా దాటేసింది.

    అలా తొలిసినిమా తోనే చరిత్ర తిరగరాసి ఇండస్ట్రీ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు నితిన్. ఇక ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో గోపీచంద్ కూడా ఒకడు. ఆయన విలనిజం వెండితెర పై అద్భుతంగా పండింది. ఆరోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందని అంచనా.

    అయితే ఈ సినిమాని తొలుత నితిన్ చెయ్యాలని అనుకోలేదట, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేదా అల్లరి నరేష్ తో చేద్దాం అనుకున్నాడట డైరెక్టర్ తేజ.కానీ ఎందుకో అల్లు అరవింద్ గారికి ఈ కథ నచ్చలేదట, ఇది తన కొడుక్కి సరైన లాంచింగ్ సినిమా కాదని అనిపించడం తో ఆయన ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.

    ఆ తర్వాత అల్లరి నరేష్ ని కూడా ఈ చిత్రం కోసం అడిగారట. కానీ ఆయన డేట్స్ అప్పటికీ ఖాళీ లేకపోవడం తో ఇక ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తన కొడుకుని హీరో గా లాంచ్ చేసే ప్రయత్నం లో ఉండగా ఈ కథని విని వెంటనే ఓకే చెప్పాడు. ఆ తర్వాత హిస్టరీ మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూత్ కి ఎంతో ఇష్టం. బయట కూడా వినిపిస్తూనే ఉంటాయి.