Samantha – Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత నాగ చైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోయారు. పెళ్ళైన కొంత కాలానికి వీరి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2021 లో నాగ చైతన్య సమంత అధికారంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. విడిపోయి ఇంత కాలం అవుతున్న వారి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
అయితే తాజాగా సమంత నాగ చైతన్య ల గురించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళ పెళ్లి ఫోటోని మాత్రం నాగార్జున ఇంట్లోని హాల్ లో ఇంకా అలానే ఉంచారట. వాళ్ళు విడిపోయారు కదా ఇంకెందుకు అని చాలామంది అంటున్నా దాన్ని మాత్రం తీయడం లేదని తెలిసింది. సమాచారం ప్రకారం వారి పెళ్లి ఫోటో తొలగించక పోవడానికి కారణం, అందులో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఉండటమేనట.
ఆ ఫోటోలో నాగార్జున, అమల అఖిల్ తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. నాగ చైతన్య ఎక్కడ కూడా ఈ విషయం పై మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పరోక్షంగా విడాకుల ఫై స్పందించింది.
విడిపోయిన తర్వాత కూడా సమంత నాగ చైతన్య ఒకరి జ్ఞాపకాలు ఒకరు పదిలంగా దాచుకున్నారు అని న్యూస్ వైరల్ అయింది. పైగా వారు రహస్యంగా కలుస్తున్నారు అంటూ రూమర్స్ కూడా వినిపించాయి.ఇలా ఈ జంట గురించి తరచు ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ జంట మల్లి కలిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
Web Title: This is the reason for samantha naga chaitanyas wedding photo at nagarjunas house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com