Akkineni Nageswara Rao: ప్రతి ఒక వ్యక్తికి ఇష్టమైన ప్రదేశం ఒకటి ఉంటుంది. అది మన ఇల్లు కావచ్చు, తోట కావచ్చు. లేదా టూరిస్ట్ ప్లేస్ కావచ్చు. అలాగే నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఓ ఇష్టమైన ప్రదేశం ఉందట. అది గీతాంజలి హోటల్. చెన్నై పాండీ బజార్ లో ఉండే గీతాంజలి హోటల్ తో ఆయనకు అనుబంధం ముడిపడిందట. ఆ హోటల్ లో కూర్చునే కథలు వినేవాడట. అది ఆయనకు ఒక సెంటిమెంట్ అట. మిత్రులు, సన్నిహితులతో అక్కడ కాలక్షేపం చేసేవాడట. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక ఏఎన్నార్ ఇక్కడకు వచ్చేశారు. అయినప్పటికీ గీతాంజలి హోటల్ ని ఆయన తరచుగా సందర్శించేవారట.
ఏఎన్నార్ చివరి పుట్టినరోజు వేడుకలు అక్కడే జరగడం మరొక విశేషం. వివిధ జనరేషన్స్, భాషలకు చెందిన నటులు పాల్గొన్న ఏఎన్నార్ 89వ పుట్టినరోజు వేడుక, గీతాంజలి హోటల్ లో ఘనంగా జరిగింది. అది జరిగిన నాలుగు నెలలకు ఏఎన్నార్ 2014 జనవరి 22న కన్నుమూశారు. ఏఎన్నార్ సుదీర్ఘ నట ప్రస్థానంలో డబ్బులు కూడబెట్టారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆయనకు ఫార్మ్ హౌసులు, వివిధ ప్రదేశాల్లో ఇళ్లు, బంగ్లాలు ఉన్నాయి. అయినప్పటికీ ఓ ప్రైవేట్ హోటల్ తో ఆయన అనుబంధం పెంచుకున్నారు.
ఏఎన్నార్ కెరీర్ చెన్నైలో మొదలైంది. అక్కడే ఆయన స్టార్ అయ్యారు. బహుశా గీతాంజలి హోటల్ ఆయనకు లక్కీ ప్లేస్ కావచ్చు. అక్కడ కథలు వింటే హిట్ అవుతాయని ఆయన నమ్మవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు అంటారు. ఏఎన్నార్ క్లాస్ సబ్జెక్ట్స్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఎన్టీఆర్ పౌరాణిక, మాస్ కమర్షియల్ చిత్రాలతో అతిపెద్ద హిట్స్ నమోదు చేశాడు.
ఇటీవల ఏఎన్నార్ శతజయంతి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ అవార్డు చిరంజీవికి నాగార్జున ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లో ఈ వేడుక జరిగింది. ఏఎన్నార్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు ప్రెజెంటేషన్ ఈవెంట్లో సందడి చేశారు. అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Web Title: Legendary actor akkineni nageswara rao favorite place
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com