ANR On Daana Veera Soora Karna: దానవీరశూర కర్ణలో ఆ పాత్రను ఏఎన్నార్ చేయాల్సి ఉండేది.. కానీ ఆయన ఏమన్నారంటే?

రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరకీ తెలియదు. కానీ సినిమాల ద్వారా రాముడు, కృష్ణుడి గెటప్ వేసి దేవుడంటే ఇలానే ఉంటాడు.. అని అనిపించిన ఏకైక హీరో ఎన్టీఆర్. ఈయన సినిమా వస్తుందంటే థియేటర్లో పండుగ వాతావరణం ఉండేది. ఈ తరుణంలో 1977లో ఎన్టీఆర్ సొంతంగా దానవీరశూరకర్ణ అనే సినిమాను తీశాడు. మహాభారతంలోని కొన్ని ఘట్టాలను మిలితం చేసి ఈ సినిమాను తీశారు. ఇందులో మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ కనిపిస్తారు. అందులో శ్రీకృష్ణుడి గెటప్ నూ అన్నగానే వేశారు.

Written By: Srinivas, Updated On : July 11, 2023 9:21 am

ANR On Daana Veera Soora Karna

Follow us on

ANR On Daana Veera Soora Karna: తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ అంటే మహా క్రేజ్. అప్పట్లో ఆయన సినిమాలంటే ఎగబడి చూసేవారు. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో విభిన్న చిత్రాలు తీసి.. కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. వెండితెరపై ఎన్టీఆర్ హవా సాగుతున్న సమయంలో ఆయన స్వీయ డైరెక్షన్లో ఓ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అదే దానవీరశూరకర్ణ. ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తాడు. కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి గెటప్ లో అలరిస్తాడు. అయితే కృష్ణుడి పాత్రలో అప్పటికే పలు సినిమాల్లో ఎన్టీఆర్ కనిపించారు. మరోసారి ఆ గెటప్ లో కనిపిస్తే బాగోదని అనుకొని ఈ పాత్రను అక్కినేని నాగేశ్వర్ రావును చేయాలని కోరారట. కానీ అందుకు ఏఎన్నార్ షాకింగ్ కామెంట్స్ చేశారట.

రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరకీ తెలియదు. కానీ సినిమాల ద్వారా రాముడు, కృష్ణుడి గెటప్ వేసి దేవుడంటే ఇలానే ఉంటాడు.. అని అనిపించిన ఏకైక హీరో ఎన్టీఆర్. ఈయన సినిమా వస్తుందంటే థియేటర్లో పండుగ వాతావరణం ఉండేది. ఈ తరుణంలో 1977లో ఎన్టీఆర్ సొంతంగా దానవీరశూరకర్ణ అనే సినిమాను తీశాడు. మహాభారతంలోని కొన్ని ఘట్టాలను మిలితం చేసి ఈ సినిమాను తీశారు. ఇందులో మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ కనిపిస్తారు. అందులో శ్రీకృష్ణుడి గెటప్ నూ అన్నగానే వేశారు.

అయితే ఎన్టీఆర్ అప్పటికే చాలా సినిమాల్లో ఈ పాత్రను వేశారు. దీంతో మళ్లీ వేస్తే జనాలకు బోర్ కొడుతుందని ఎన్టీఆర్ భావించారు. అందుకే శ్రీ కృష్ణుడి పాత్రను ఏఎన్నార్ ను వేయాలని కోరారు. అయితే ఆ పాత్రను తాను చేయలేనని నిర్మోహమాటంగా చెప్పారట. ఏఎన్నార్ హైట్ తక్కువగా ఉండడంతో తనను మరుగుజ్జు వ్యక్తి శ్రీకృష్ణుడా? అని హేళన చేస్తారని, అందువల్ల ఈ గెటప్ వేయనని ఏఎన్నార్ ఎన్టీఆర్ తో చెప్పాడట. దీంతో అన్నగారు చేసేదేమీ లేక ఆ పాత్రను తానే వేశాడట. అయితే ఎన్టీఆర్ ఊహించినట్లు ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. మరోసారి శ్రీకృష్ణుడిగా ఎన్న ఎన్టీఆర్ ను స్వీకరించారు.

1977లో రూ.10 లక్షలతో తీసిన ఈ మూవీ అప్పట్లో రూ.కోటి వరకు కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్న ‘కురుక్షేత్రం’ అనే సినిమాను తీశారు. కానీ ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇదే మూవీని 1994లో రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతీ మూమెంట్ ఆకట్టుకుంటుంది. ఇందులోని ‘ఏమంటివి ఏమంటివి’ అనే డైలాగ్ ను నేటి సినిమాల్లో పెట్టుకుంటున్నారు.