Rathika Rose- Rahul Sipligunj: బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చి చూస్తే బాగానే సక్సెస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మొదటి వారం మంచి TRP ని కూడా సొంతం చేసుకుంది ఈ తెలుగు రియాలిటీ షో. ఇక ఈ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హౌస్ కంటెస్టెంట్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రతిక రోజ్ గురించి. కేవలం రెండు వారాల సమయం లోనే హౌస్ లో ఆమె నడిపిన లవ్ ట్రాక్ లు కావచ్చు, గొడవలు కావచ్చు మరొకరు నడపలేదనే చెప్పాలి.
మొదటి లో ప్రశాంత్ ను తన వెనుక ఎలా తిప్పించుకుందో అందరికీ తెలుసు. ఇక రెండో వారం వచ్చేసరికి ప్రిన్స్ యావర్ ను ప్లాట్ చేసింది ఈ అమ్మడు. దీనితో ఈ రతిక ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ఆరాలు మొదలయ్యాయి. దీనితో ఆమె బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లవర్ అనే విషయం బయటపడింది. అయితే వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యిందని కూడా తెలిసింది.
నిజానికి రతిక బిగ్ బాస్ లోకి వచ్చే ముందు నాగార్జున చిన్న హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు హార్డ్ బాగానే ఉంది కదా అంటూ మాట్లాడారు. అసలు రాహుల్ కి రతిక కు ఎందుకు బ్రేకప్ అయ్యిందో గతం లోనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఆమె. “మూవీ లోకి రాకముందు నుంచే లవ్ ఉండేది. ఒక మూవీ కూడా కంప్లీట్ అయింది ఈలోపు. అదే లాస్ట్ మూవీ తర్వాత మ్యారేజ్ అని అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్లకి ఇంట్రెస్ట్ లేదంట.. ఇండస్ట్రీలో ఉండొద్దు..
ఏదైనా జాబ్ అయితే ఓకే కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండొద్దని అన్నారు. అది నాకు నచ్చలేదు.. ఇప్పుడిప్పుడే నాకు ఆఫర్స్ వస్తున్నాయి.. ఆలోపే 2,3 సినిమాలు కూడా వచ్చాయి.. తమిళ్‌లో చేశాను.. నాకు ఎందుకో టైమ్ కావాలనిపించింది.. అప్పుడే మ్యారేజ్ అనేది నాకు అంత మంచి డెసిషన్ అనిపించలేదు.” అందుకే విడిపోయామని చెప్పింది రతిక. ఇక రాహుల్ మరియు రతిక బ్రేకప్ విషయం తెలిసిన దగ్గర నుంచి నెటిజన్లు సిప్లిగంజ్ పెట్టిన పోస్టులు కింద కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అన్న బ్రేకప్ చేసుకుని మంచి పని చేశారు. అందుకే ఇప్పుడు కెరీర్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.