Thandel Movie minus point
Thandel Movie : చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్ లో తెరకెక్కిన తండేల్ (Thandel) సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మరి ఈ సినిమాకి విశేషమైన స్పందన అయితే లభిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలవాల్సింది కానీ కేవలం అవరేజ్ మూవీ గానే సరిపెట్టుకోబోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. సక్సెస్ టాక్ ను కూడా సంపాదించుకోవడానికి ముఖ్య కారణం ఈ సినిమాలో సాంగ్స్ అయితే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ అవ్వడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య ఈ సినిమాతో మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో ఒక్కటి మాత్రం మైనస్ గా మారింది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
నిజానికి ఈ సినిమాలో కథ అనేది పెద్దగా లేకపోవడంతో ఈ సినిమాని ఒక ట్రూ ఇన్సిడెంట్ ద్వారా తెరకెక్కించారనే ఒక బేస్ పాయింట్ తోనే ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఇక కథలో బలం ఉన్నట్లయితే సినిమాకి వంక పెట్టాల్సిన అవసరమైతే ఉండేది కాదు.
జాలర్లు పాకిస్తాన్ పోలీసులకు దొరకడం అక్కడి నుంచి వాళ్ళు బయట ఎలా పడ్డారు అనే ఒక పాయింట్ ను క్యూరియాసిటీతో తెరకెక్కించారు. కానీ అంతకు మించిన కథ ఈ సినిమాలో అయితే లేదు. ఇక ఆ పాయింట్ కూడా పెద్ద పాయింట్ అయితే కాదు. ఇక ఇప్పటివరకు మనం కొన్ని సినిమాల్లో హీరో కొన్ని ప్రాబ్లమ్స్ తో జైల్ కి వెళ్ళడం హీరోయిన్ బయట నుంచి కొన్ని ప్రయత్నాలు చేసి అతన్ని విడిపించే సినిమాలను చాలావరకు చూశాం…
కాబట్టి ఈ సినిమాలో మళ్లీ అదే పాయింట్ ను రిపీట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా కొంతవరకు ఓకే అనిపించింది. కాబట్టి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఇంకొంచెం కథ కనక సినిమాలో ఉన్నట్లయితే సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించేది…
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: This is the only minus in the movie thandel and thats why all this is happening
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com