Homeఎంటర్టైన్మెంట్Heroines Worked With Father And Son: తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ల...

Heroines Worked With Father And Son: తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే.. అలా ఎలా చేశారు ?

Heroines Worked With Father And Son: సినిమా అంటేనే మాయలోకం. ఎమోషన్స్ తో కదిలించే ఫిక్షనల్ డ్రామా. ఐతే, ఈ డ్రామాల్లో ఎన్నో వింతలు, విశేషాలు జ‌రుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల జీవితాల్లో ఎన్నో డ్రామాలు జరుగుతాయి. వాళ్లకు ఫలానా హీరోతోనే నటించాలి అని షరతులు వర్తించవు. హీరోయిన్ల కెరీర్ మ‌హా అయితే ఓ పదిహేను ఏళ్లు మాత్రమే ఉంటుంది. అందుకే.. కెరీర్ మొదట్లో కుర్ర హీరోలతో రొమాన్స్ చేసి.. ఆ తర్వాత సీనియర్ హీరోల సరసన ఒదిగిపోతారు. ఈ క్రమంలోనే కొందరు అందాల భామలు ఇటు కొడుకులతోనూ అటు తండ్రులతోనూ రొమాన్స్ చేశారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు ? ఏ సినిమాల్లో వాళ్ళు తండ్రి, కొడుకుల సరసన నటించారు తెలుసుకుందాం రండి.

Heroines Worked With Father And Son
Sridevi, Tamannaah, Kajal

అతిలోక సుంద‌రి శ్రీదేవి :

శ్రీదేవి అంటేనే.. భూలోకాన విసరబూసిన అందాల ఉషోద‌యం. అమృతం తాగిన సోయ‌గంలా అందాలను దేవలోకం నుంచి పోగేసుకొచ్చిన ‘అతిలోక సుందరి’ ఆమె. అందుకే, అందమైన సినీ రంగుల ప్రపంచంలో ఎప్పటికీ ధ్రువతారగా నిలిచిపోతుంది శ్రీదేవి. ఈ అందాల ఆరాధ‌న‌ దేవిత, అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ త‌ర్వాత కాలంలో ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జున‌తో కూడా రొమాన్స్ చేసింది. ఆఖ‌రుపోరాటం, గోవిందా గోవిందా లాంటి చిత్రాల్లో శ్రీదేవి – నాగ్ కలిసి నటించారు.

Also Read: Hero Raja: హీరో రాజా సినిమాలు మానేసేందుకు అసలు కారణం ఏంటి?

Heroines Worked With Father And Son
Akkineni Nageswara Rao, Sridevi – nagarjuna

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా :

తమన్నా భాటియా గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో అటు తెరపైన, ఇటు తెర బయట కూడా అందాల సంచలనంగా మారింది. కాగా ఈ మిల్కీబ్యూటీ కూడా రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ అనే సినిమాలో నటించింది. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ సినిమాలో న‌టించి.. అలరించింది. ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్ తో భోళాశంక‌ర్ అనే సినిమాలో నటిస్తోంది.

Heroines Worked With Father And Son
Tamannaah, Ram Charan

అందాల చందమామ కాజ‌ల్ :

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన కెరీర్ స్టార్టింగ్ లో రామ్‌చ‌ర‌ణ్‌ కు జోడీగా మ‌గ‌ధీర చిత్రంలో నటించి మెప్పిచింది. అలాగే, చరణ్ సరసన నాయ‌క్ అనే సినిమాలోనూ ఆడిపాడింది. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబ‌ర్ 150’ సినిమాలో న‌టించి అలరించింది.

Heroines Worked With Father And Son
Kajal Aggarwal, Ram Charan, Chiranjeevi

టాల్ బ్యూటీ ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ :

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. హీరో నాగ‌చైత‌న్య‌తో కలిసి రకుల్ ‘రారండోయ్ వేడుక‌చూద్దాం’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత నాగార్జున‌తో కలిసి ‘మ‌న్మ‌థుడు 2’లో నటించి ఆకట్టుకుంది. కానీ, ర‌కుల్ – నాగ్ జంట‌పై విమ‌ర్శ‌లు వచ్చాయి.

Rakul Preet Singh
Rakul Preet Singh

హోమ్లీ గర్ల్ లావ‌ణ్య త్రిపాఠి :

హోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి ఛాన్స్ లు కోసం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చాన్స్ లు కావాలని తెగ ఆశ పడుతుంది. ఐతే, ఈ సొట్ట‌బుగ్గ‌ల సుందరి కూడా మొదట ‘నాగ‌చైత‌న్య‌’తో ఓ సినిమా చేసింది. ఆ త‌ర్వాత నాగార్జున‌తో ‘సోగ్గాడే చిన్ని నాయ‌న’ సినిమాలో నటించింది.

Lavanya Tripathi
Lavanya Tripathi

మాధురి దీక్షిత్ :

మాధురి దీక్షిత్ సినీ కెరీర్ కొత్త హీరోయిన్లకు ఓ ప్రేరణ. మొదట్లో హీరోయిన్ గా పనికిరాదు అన్నారు. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగామాధురి దీక్షిత్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఐతే, మాధురి దీక్షిత్ కూడా రిషి క‌పూర్‌ తో ఓ సినిమాలో రొమాన్స్ చేసింది. ఆ త‌ర్వాత అతని కొడుకు ర‌ణ‌బీర్ క‌పూర్‌తో కూడా క‌లిసి న‌టించింది.

Madhuri Dixit
Madhuri Dixit

రాణి ముఖర్జీ :

బాలీవుడ్ అందాల భామ రాణి ముఖర్జీ కూడా బిగ్‌బీ అమితాబ‌చ్చ‌న్‌ తో, అలాగే ఆ త‌ర్వాత అభిషేక్‌ తో కలిసి నటించింది.

Rani Mukerji
Rani Mukerji

అమృత సింగ్ :

హీరోయిన్ అమృత‌సింగ్ కూడా ఇటు ధ‌ర్మేంద్ర‌తో, అటు కొడుకు స‌న్నీడియోల్ తోనూ రొమాన్స్ చేసింది. ఈ లిస్ట్ లో సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఉంది. ఆమె శివాజీ గ‌ణేష‌న్‌తో పాటు ఆయ‌న కొడుకు ప్ర‌భుతో కూడా కలిసి నటించింది. అలాగే కీర్తి సురేష్ కూడా అటు హీరో విక్ర‌మ్‌తోనూ ఆ తర్వాత విక్రమ్ కొడుకు ధృవ్‌ తోనూ కలిసి నటించింది. మొత్తానికి అటు తండ్రి, ఇటు కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.

Amrita Singh
Amrita Singh

Also Read:Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular