OG Trailer Review: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ(They Call Him OG) మూవీ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. నిన్న ఉదయం విడుదల అవ్వాల్సిన ట్రైలర్ ని సాయంత్రం విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికీ DI వర్క్ పూర్తి కాకపోవడం తో నిన్న అసలు ట్రైలర్ విడుదల అనే విషయాన్నీ పక్కన పెట్టి నేడు కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. మామూలు ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. ట్రైలర్స్ ని కట్ చేయడం సుజీత్ స్టైల్ వేరు. ఈ ట్రైలర్ లో కూడా తన మార్క్ కనిపించింది. కానీ ప్రతీ ట్రైలర్ లో లాగానే ఈ ట్రైలర్ లో కూడా ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నాయి. ఒకసారి వాటి గురించి వివరంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
ప్లస్సులు :
పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయి అగ్రెస్సివ్ రోల్ లో చూపించడం అభిమానులకు బాగా నచ్చింది. అంతే కాకుండా షాట్ మేకింగ్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నరికే సన్నివేశాలు, షాట్ గన్ ని బూటితో లోడ్ చేయడం, చివర్లో వాచీని ఊపుకుంటూ స్టైల్ గా పోలీస్ స్టేషన్ లోకి నడిచిన వచ్చే సన్నివేశం ఇవన్నీ ప్లస్సులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముంబై వస్తున్నా, తలలు జాగ్రత్త అంటూ బేస్ వాయిస్ తో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి అభిమానులు మెంటలెక్కిపోయారు. అదే విధంగా టాక్ హోటల్ బయట ఆయన మనుషులను నరికి స్టైల్ గా కారు మీద కూర్చోవడం కూడా హైలైట్ గా నిల్చింది. ముంబై కి తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఒక చేతిలో కత్తి పట్టుకొని,మరో చేతిలో బాంబులు మరియు ఇతర మరుణాయుధాలతో స్టైల్ గా నడిచి రావడం వేరే లెవెల్ అనిపించిందోయ్.
మైనస్సులు:
ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఈ సినిమాలో స్టోరీ పెద్దగా ఏమి లేనట్టుగా అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన గ్యాంగ్ స్టోరీ నే, ఆయనకు ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ సినిమా జనరంజకంగా ఉంటుందా లేదా అనేది డైరెక్టర్ సుజిత్ టేకింగ్ ని బట్టి ఉంటుంది. ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాల్లో స్టోరీలు పెద్దగా ఏమి ఉండట్లేదు. కేవలం డైరెక్టర్ టేకింగ్ ని బట్టే ఉంటుంది. అయితే ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీర..ఓజాస్ గంభీర..నా కొడకల్లారా’ అంటూ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. భీమ్లా నాయక్ లోని పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తుకు వచ్చాడు. సినిమాలో ఎమోషన్ కి తగ్గ అగ్రెషన్ లాగా ఈ సన్నివేశం ఉంటే పర్లేదు, లేదా సినిమాకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంటుంది అనేది.