https://oktelugu.com/

Extra Ordinary Man: ఊహించని ట్విస్ట్ తో వస్తున్న ఎక్స్ ట్రా మూవీ స్టోరీ ఇదే…

ఈ సినిమా ప్లాప్ అవ్వడం తో తను ఇప్పుడు ఎక్స్ ట్రా మూవీతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని చాలా కన్ఫి డెంట్ గా వంశీ ఈ సినిమా ని తీసినట్టు గా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 31, 2023 / 03:41 PM IST

    Extra Ordinary Man

    Follow us on

    Extra Ordinary Man: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నారు. చెక్, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలతో వరుసగా ప్లాప్ లను అందుకున్నాడు.ఇక ఇప్పుడు హిట్ అందుకోవాలని ఉద్దేశ్యం తో ఉన్నాడు ఇక ఇలాంటి క్రమం లోనే రైటర్ గా మంచి స్టోరీ అందించి స్టార్ హీరోలకి సైతం మంచి విజయాలు అందించిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా అనే సినిమా చేస్తున్నాడు. వక్కంతం వంశీ ఇంతకుముందే అల్లు అర్జున్ హీరో గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేసి ప్లాప్ ని అందుకున్నాడు…

    ఈ సినిమా ప్లాప్ అవ్వడం తో తను ఇప్పుడు ఎక్స్ ట్రా మూవీతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని చాలా కన్ఫి డెంట్ గా వంశీ ఈ సినిమా ని తీసినట్టు గా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ చాలా బాగుంది.అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…

    ఈ సినిమా కథ ని చూసుకుంటే హీరో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే ఒక నటుడు గా కనిపిస్తాడు అయితే ఆయన ఈ సినిమా లో అలా జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూనే ఎప్పటికైనా తను ఎక్స్ ట్రాడినరి అబ్బాయి గా పేరు తెచ్చుకోవాలని చూస్తాడు కానీ నిజానికి తను ఒరిజినల్ స్టోరీ వేరే ఉంటుంది తన కెరియర్ లో తనకి జరిగిన అన్యాయం పట్ల రివెంజ్ తీర్చుకునే ఇంకో షేడ్ ఉన్న క్యారెక్టర్ లో నితిన్ కనిపిస్తాడు…అయితే నితిన్ లో ఉన్న ఇంకో షేడ్ అనేది సస్పెన్స్ గా ఉంచి సినిమా ఇంటర్వల్ లో దాన్ని రివిల్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…

    అసలు కథ ఏంటంటే నితిన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు అలా తన ఫ్రెండ్ ఒక కంపెనీ లో జాబ్ చేస్తున్నప్పుడు మిస్ అండర్ స్టాండింగ్ వల్ల అనుకోకుండా ఒక రోజు జరిగిన గొడవలో అతన్ని కొంతమంది రౌడీలు చంపేస్తారు దాంతో హీరో వాళ్ల మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా కథ అనేది తెలుస్తుంది ఇక ఈ స్టోరీ చాలా రొటీన్ ది అయినప్పటికీ మేకింగ్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని సినిమా యూనిట్ చెప్తుంది…

    ఇక ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా బాగానే ఉంటుంది…ఈ టీజర్ లో దానికి సంభందించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చూపించడం జరిగింది…అయితే ఈ సినిమా లో లక్కీ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాతో అటు వక్కంతం వంశీ, ఇటు నితిన్ ఇద్దరు కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు…మరి వీళ్ళు అనుకున్న సక్సెస్ వీళ్ళకి వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే…