https://oktelugu.com/

Poori Jagannath:లైగర్ తో పూరి జగన్నాథ్ కు అయిన జ్ఞానోదయం ఇదీ

Poori Jagannath:డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక్కసారిగా రచయితగా మారిపోయాడు.. జీవితం గురించి కొన్ని సత్యాలను చెప్పాడు.. ఒడొదొడుకుల జీవితాన్ని అందరూ ఆస్వాదించాలని అంటున్నాడు.. ఇలాంటి కొన్ని వ్యాఖ్యలను చేరుస్తూ ఆయన రాసిన లేఖ వైరల్ అవుతోంది. పూరి డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ గా మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కలిసి తమ నష్టాలన్ని పూడ్చాలని ఆందోళన చేశారు. తమ నష్టానికి పూరినే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోఆయన ఓ […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : October 30, 2022 2:28 pm
    Follow us on

    Poori Jagannath:డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక్కసారిగా రచయితగా మారిపోయాడు.. జీవితం గురించి కొన్ని సత్యాలను చెప్పాడు.. ఒడొదొడుకుల జీవితాన్ని అందరూ ఆస్వాదించాలని అంటున్నాడు.. ఇలాంటి కొన్ని వ్యాఖ్యలను చేరుస్తూ ఆయన రాసిన లేఖ వైరల్ అవుతోంది. పూరి డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ గా మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కలిసి తమ నష్టాలన్ని పూడ్చాలని ఆందోళన చేశారు. తమ నష్టానికి పూరినే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోఆయన ఓ లేఖ రాసి రిలీజ్ చేశారు. ఇది నెట్టింట్ల వైరల్ గా మారుతోంది.

    ‘లైగర్’ సినిమా తరువాత పూరిజగన్నాథ్ మళ్లీ సినిమాలు తీస్తారా..? లేక ఆపేస్తారా..? అని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో ఆయన ఆర్థిక పరిస్థితి, కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన విడుదల చేసిన లేఖలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేర్చారు. ‘జీవితంలో జయాపజాలు సర్వసాధారణం. జీవితాన్ని ఓ సినిమాలాగ చూడాలి. విజయం సాధిస్తే డబ్బు వస్తుంది.. పరాజయం పొందితే జ్ఒానం వస్తుంది. నిజం నిజాన్నే చెబుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రేక్షకులు ప్రతీ సినిమాను ఆస్వాదిస్తారు. వారి పట్ల నేను ఎప్పుడూ బాధ్యతగానే ఉంటాను.. త్వరలో మరో సినిమా తీస్తా.. తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తా..’ అని తెలిపారు.

    విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్’ పై అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ థియేటర్లోకి వచ్చేసరికి సినిమా నిరాశ పర్చింది. దీంతో ఈ మూవీపై కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. అంతేకాకుండా సినిమా మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో డిస్డ్రిబ్యూటర్లు సైతం ఆందోళన చెందారు. సినిమా బాటుందని చెప్పిన పూరి ఆ తరువాత తమను మోసం చేశాడని కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారిని చల్లార్చడానికి ఓ లేఖను విడుదల చేశారు.