Samantha: అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. ముందుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినా.. ఆ తరువాత కార్యక్రమం పూర్తయిన తరువాత అక్కినేని నాగార్జున వారి ఫొటోలను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. దీంతో మరోసారి అక్కినేని వారింట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ప్రముఖులు సైతం నాగచైతన్యకు విషెష్ చెప్పారు. అయితే అక్కినేని నాగచైతన్య వివాహ నిశ్చితార్థం సందర్భంగా ఆయన మాజీ భార్య సమంత రుతుప్రభు ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ షాకింగ్ పిక్ ను జోడించి మెసేజ్ పెట్టారు. అక్కినేని నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల పాటు వీరు కలిసి ఉన్నారు. ఆ తరువాత వీరిద్దరి మధ్యవ మనస్పర్థలు వచ్చాయి. దీంతో తామూ దూరం అయినట్లు ఎవరికి వారు ప్రకటించారు. ఆ తరువాత ఇటు అక్కినేని నాగచైతన్య ఎవరిని పెళ్లి చేసుకుంటారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అటు సమంతకు జోడీగా మరెవరు వస్తారోనని వెయిట్ చేశారు. అయితే కొంతకాలంలో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల మధ్య ప్రేమాయణం నడుస్తోంది. వీరు కలిసి ఒకే ప్లైట్ లో ప్రయాణం చేశారు. ఆ తరువాత ఒకే కారులో కనిపించారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా రూమర్స్ ను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థం విషయం తెలియగానే సమంత నెట్లో ఓ పోస్టు పెట్టారు.ఆ పోస్టు చూసి షాక్ అవుతున్నారు. అదేంటంటే?
నాగచైతన్య నుంచి విడిపోయిన తరువా సమంత పట్ట పగ్గాలు లేకుండా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తోంది. ఒక దశలో చైతూతో విడిపోయిన తరువాత సమంత స్వేచ్ఛగా విహరిస్తున్నారని అన్నారు. ఈ తరుణంలో సమంత సైతం ఎప్పటికప్పుడ తన పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది. అయితే కొన్ని సందర్భాల్లో సమంతను నాగచైతన్య గురించి అడిగే ప్రయత్నం చెప్పగా డైవర్ట్ చేసేవారు. ఆ మధ్య కరణ్ జోహార్ కాపీ విత్ కరణ్ కార్యక్రమంలో సమంతను నాగచైతన్య గురించి అడిగారు. ఈ సమయంలోసమంత పాస్ట్ పాస్ట్ అంటూ మాట దాటవేశారు. దీంతో ఇక నాగచైతన్యకు దగ్గరయ్యే అవకాశం లేదనే చర్చ సాగింది.
అయితే సమంత కొన్ని కారణాల వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ సమయంలో ఆమెకు ఇండస్ట్రీ నుంచే కాకుండా ఫ్యాన్స్ నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనైనా నాగచైతన్య స్పందిస్తారా? అని ఎదురుచూశారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వీరు మళ్లీ కలిసే అవకాశం లేదని అన్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఏదో ఒక సమయంలో కలుస్తూనే ఉన్నారు. దీంతో వీరిద్దరు ఒక్కటయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే నాగ్ కుటంబం దీనిపై స్పందించకపోవడంతో ఇవన్నీ రూమర్స్ అన్నారు.
కానీ తాజాగా వీరి నిశ్చితార్థం కావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా సమంత రియాక్షన్ కోసం అందరూ ఎదురుచూశారు. అయితే సమంత తెలివిగా స్పందించినట్లు తెలుస్తోంది. ఓ హార్ట్ బ్రేక్ అయినట్లు ఇమేజ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీంతో అందరూ నాగచైతన్య గురించి అనుకున్నారు. కానీ ఆమె పోస్టు చేసింది. వినేశ్ పొగాట్ గురించి. పారిస్ ఒలంపిక్స్ లో వినేశ్ పొగాట్ అనర్హత కారణంగా పతకం చేజారిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతుగా సమంత రియాక్ట్ అయింది. అయితే ఇదే రోజు నాగచైతన్య నిశ్చితార్థం కూడా కావడంతో రెండింటికీ పనిచేసిందని కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More