https://oktelugu.com/

Pawan Kalyan Pooja Hegde Movie: పవన్ తో సినిమా పై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే

Pawan Kalyan Pooja Hegde Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే, ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో పూజా హెగ్డే ఎంపిక గురించి ప్రశ్న ఎదురైంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 9, 2022 / 12:26 PM IST
    Follow us on

    Pawan Kalyan Pooja Hegde Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే, ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో పూజా హెగ్డే ఎంపిక గురించి ప్రశ్న ఎదురైంది.

    Pawan Kalyan Pooja Hegde Movie

    అందుకు ఆమె నవ్వుతూ “ఆ విషయాన్ని హరీశ్ శంకర్ గారిని అడగండి” అంటూ సమాధానం ఇచ్చింది. అంతే తప్ప తాను ఆ సినిమాను చేయడం లేదని మాత్రం పూజా హెగ్డే చెప్పలేదు. కాబట్టి కచ్చితంగా పూజా హెగ్డే పవన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ తాజాగా క్లారిటీ వచ్చింది. అన్నట్టు ఈ సినిమా కథ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

    Also Read: నాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు – ప్రభాస్

    హరీష్ శంకర్ రాసిన కథలో పవన్ పై ఓ ప్లాష్ బ్యాక్ రాశాడని, ఆ ప్లాష్ బ్యాక్ లో పవన్ పక్కా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్లాష్ బ్యాక్ లో ఆ సిన్సియర్ పోలీస్ ను ప్రజలే తమ స్వార్థంతో బలి చేస్తారు. దాంతో ఆ పోలీస్ కొడుకు ‘యంగ్ పవన్’ ప్రజల పై ఎలా పగ తీర్చుకున్నాడు ? చివరకు ప్రజల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ? అనేది మెయిన్ కథ అట.

    మొత్తానికి ఈ కథ పవన్ రాజకీయాలకు బాగా పనికొచ్చేలా ఉంది. ఇక తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవనే నటించబోతున్నాడు. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. మెయిన్ గా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

    Pawan Kalyan Pooja Hegde Movie

    అందుకే, హరీష్ శంకర్ తెలివిగా పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ పెట్టుకున్నాడు. అలాగే తన కథకి మంచి కమర్షియల్ అంశాలు కూడా బాగా అద్దాడు. మరి హరీష్ ఈ సినిమాతో పవన్ పూర్వ మాస్ వైభవాన్ని తెలుగు తెరకు మరోసారి ఘనంగా చాటి చెప్పగలడా ? చూడాలి.

    Also Read: పవన్ మేనియా.. లేడీ పోలీసుల కోసం ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో..

    Tags