Bigg Boss 9 Telugu vs Kannada: గత బిగ్ బాస్ సీజన్ లో తెలుగు వెర్సస్ కన్నడ అంటూ ఎంత పెద్ద రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడ వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి తెలుగు కంటెస్టెంట్స్ ని తొక్కేస్తున్నారని, చివరికి స్టార్ మా ఛానల్ కి ఉపయోగపడే కన్నడ వాడైనా నిఖిల్ ని కావాలని ఉద్దేశపూర్వకంగా గెలిపించి, తెలుగోడు అయినటువంటి గౌతమ్ కి అన్యాయం చేసారంటూ సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరిగింది. గత సీజన్ లో ఇది పెద్ద రచ్చ అయ్యింది కదా, ఈ సీజన్ లో జాగ్రత్తలు తీసుకొని కేవలం తెలుగు వాళ్లనే ఎక్కువగా తీసుకుంటారని అనుకున్నారు. కానీ సెలబ్రిటీస్ లిస్ట్ లో ఈసారి కూడా ఇతర భాషలకు సంబంధించిన వాళ్లనే తీసుకున్నారు. కన్నడ భాషకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మరోపక్క నార్త్ ఇండియా కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు.
సెలబ్రిటీస్ లో తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే భరణి శంకర్, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి మాత్రమే సెలబ్రిటీస్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇక సామాన్యులు ఎలాగో తెలుగు వాళ్ళే కాబట్టి సరిపోయింది. హౌస్ మొత్తం సెలబ్రిటీలు ఉండాలి అన్నట్టుగా ఉంటే ఇది తెలుగు బిగ్ బాస్ కాదు, కన్నడ బిగ్ బాస్ లాగా మారిపోయేది అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకు ప్రతీ సారి బిగ్ బాస్ టీం తెలుగు వాళ్ళని విస్మరిస్తున్నారు?, తెలుగు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి వచ్చేందుకు ఇష్టపడడం లేదా?, లేకపోతే తెలుగు వాళ్ళ నుండి వాళ్లకు కావాల్సిన కంటెంట్ రావడం లేదనే ఉద్దేశ్యం ఉందా అని అంటున్నారు విశ్లేషకులు. అయితే గత సీజన్ లో లాగా ఈసారి తెలుగు వెర్సస్ కన్నడ లాంటి గొడవలు ఉండకపోవచ్చు. ఎక్కువగా సామాన్యులు మరియు సెలబ్రిటీలు అనే క్లాష్ నే ఉంటుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.