
శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉంది జనంలో. అందుకే సహజంగా ముందునుంచి శేఖర్ కమ్ముల సినిమాలకు టీవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్ ‘ చైతు – సాయిపల్లవి’లతో లవ్ స్టోరీ అనే సినిమాకి ఒక్క డిజిటల్ రైట్స్ కే అమెజాన్ ప్రైమ్ సుమారు 55 కోట్లు ఆఫర్ చేసిందని.. చైతు కెరీర్ లోనే ఇది రికార్డ్ అని, చైతూ గత సినిమాలన్నింటి కంటే ఇది భారీ ధర అని తెలుస్తోంది. అమెజాన్ సంస్థ ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడానికేనట.
Also Read : ‘రకుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి !
స్వతహాగా తెలుగులో అమెజాన్ సంస్థకు ఎక్కువుగా ఫ్యామిలీ ఆడియన్స్ వినియోగదారులుగా లేరు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుకోవడానికే ‘లవ్ స్టోరీ’ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. మొన్నటి వరకూ జీ5 పోటీలో ముందు ఉంది. ఇప్పుడు అమెజాన్ రేసులోకి వచ్చి మొత్తానికి లవ్ స్టోరీని ఎగరేసుకుపోయింది. ఇప్పటికే నాని ‘వి’, సూర్య ‘ఆకాశమే హద్దుగా’, విజయ్ ‘మాస్టర్’ లాంటి సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ టికెట్ ను బుక్ చేసేసుకున్నాయి. ఇప్పుడు వీటితో పాటు లవ్ స్టోరీ కూడా అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది. మొత్తానికి ఈ కరోనా దెబ్బకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగిందట.
అందుకే లవ్ స్టోరీకి భారీ ధర పలికింది. దానితో పాటు ఈ సినిమా కాంబినేషన్ అలాగే శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఈ సినిమా బిజినెస్ కి బాగా ప్లస్ అయిందనేది వాస్తవం. దాంతోనే మొదటి నుండి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఈ సినిమా కోసం బాగా ఆసక్తి చూపించాయి. అలాగే ప్రసుతం థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి లేకపోవడం, భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. ఇక ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ సినిమాకి నిర్మాతలు .
Also Read : ప్రభాస్ ఎపిక్ కోసం గొప్ప లెజెండరీ డైరెక్టర్!