Childhood Photo: ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్.. తల్లి ఒకప్పుడు సెన్సెషనల్ నటి.. ఎవరో గుర్తుపట్టండి..

1980ల్లో స్టార్ హీరోయిన్లలో రాధా ఒకరు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈమె మిగతా హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రాధ పలు సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన అడవి దొంగ, నాగు, స్టేట్ రౌడీ నుంచి కొండవీటి దొంగ వరకు దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ అయినవే. ఆ కాలంలో హిట్టు కపుల్ గా నిలిచిన ఈ జంట తో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఆ తరువా రాధ తమిళ ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేసి పెళ్లి చేసుకుంది.

Written By: Chai Muchhata, Updated On : July 17, 2023 10:14 am

Childhood Photo

Follow us on

Childhood Photo: ఒక్క ఫొటో లక్ష మెదళ్లను కదిలిస్తుంది. అలాగే మన చిన్ననాటి విషయాలను గుర్తు చేస్తాయి. చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన విషయాల సందర్భంగా కొన్ని ఫొటోలను తీసుకుంటూ ఉంటారు. వాటిని భవిష్యత్ లో చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అలాగే ఈమధ్య సినీ నటులకు సంబంధించిన ఓల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లేటేస్టుగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. ఆమె కంటే ముందే తన తల్లి హీరోయినన్ గా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె బాటలోనే కూతురు రాణిస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? అయితే కిందికి వెళ్లండి.

1980ల్లో స్టార్ హీరోయిన్లలో రాధా ఒకరు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈమె మిగతా హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రాధ పలు సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన అడవి దొంగ, నాగు, స్టేట్ రౌడీ నుంచి కొండవీటి దొంగ వరకు దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ అయినవే. ఆ కాలంలో హిట్టు కపుల్ గా నిలిచిన ఈ జంట తో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఆ తరువా రాధ తమిళ ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేసి పెళ్లి చేసుకుంది.

రాధకు ఇద్దరు కూతుళ్లు, వీరిలో ఒకరు కార్తీక, మరొకరు తులసి. వీరిలో కార్తీక తెలుగు ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ఈ మూవీ యావరేజ్ హిట్టుకొట్టినా.. కార్తీకకు మాత్రం గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ‘రంగం’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం కార్తీక ఖాళీగానే ఉంటోంది. అయితే సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది.

జూన్ 27న ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా కార్తీకకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఎంతో ముద్దుగా ఉన్న కార్తీక ఇప్పుడు కూడా అలాగే ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఫేస్ లో మొత్తంమార్పు వచ్చిందని మరికొందరు అంటున్నారు. తల్లి లాగే కార్తీక పలు సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. తెలుగులో నటించకపోయినా తమిళంలో అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది.