https://oktelugu.com/

Bollywood Star Actress: డ్యాన్స్ రాదన్నారు.. కట్ చేస్తే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం ఇండియాలోనే అగ్ర కథానాయకల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు... ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు.

Written By:
  • Gopi
  • , Updated On : April 27, 2024 / 10:49 AM IST

    Katrina Kaif reveals the comment she heard while performing with Venkatesh

    Follow us on

    Bollywood Star Actress: బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన కత్రినా కైఫ్ ఒకప్పుడు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు అంటూ చాలా విమర్శలను ఎదుర్కొని మానసికంగా చాలా కృంగిపోయేదట. అందరూ ఆమె ముఖం మీదనే నీకు డ్యాన్స్ రాదు అంటూ హేళన చేసేవారట. ఇక ఆమె ఆ తర్వాత డ్యాన్స్ యాక్టింగ్, డ్యాన్స్ బాగా నేర్చుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ను అందుకుంది.

    ఇక ప్రస్తుతం ఇండియాలోనే అగ్ర కథానాయకల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇదిలా ఉంటే వెంకటేష్ హీరోగా చేసిన మల్లీశ్వరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు అందివ్వగా, విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు.

    అయితే రీసెంట్ గా విజయ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్లీశ్వరి సినిమా కోసం చాలామంది హీరోయిన్స్ ని చూశాం. అయినప్పటికీ ఎవ్వరూ సెలెక్ట్ అవలేదు ఇక ఒక చిన్న యాడ్ లో కత్రినా కైఫ్ ని చూసి తనను హీరోయిన్ గా తీసుకున్నాం. ఇక అప్పుడే ఆమెకు 70 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చాం. అలాగే ఆమె అకమిడేశన్ కోసం దాదాపు 25 లక్షల వరకు ఖర్చు చేశామని మొత్తం కోటి రూపాయల వరకు తన మీద ఖర్చు పెట్టినట్టుగా తెలియజేశాడు.

    అయితే ఈ సినిమాల ద్వారా కత్రినా కైఫ్ కి మంచి పేరు అయితే వచ్చింది. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు డాన్స్ సరిగ్గా రాదని చాలా ఇబ్బంది పడేదని అప్పుడు విజయ్ భాస్కర్ పర్లేదు నిదానంగా డాన్స్ నేర్చుకో, ప్రస్తుతానికైతే నీకు వచ్చిన స్టెప్పులు వేయమని చెప్పాడట…ఇక కత్రినా కైఫ్ ని విజయ్ భాస్కర్ చాలా మోటివేట్ చేస్తూ ఉండేవాడట. ఇక మొత్తానికి అయితే తను ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయం అంటూ విజయ్ భాస్కర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…