Childhood Photo: ఈ క్యూట్ బేబీ.. తెలుగు, తమిళ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి?

సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో హీరోయిన్లకు చాలా అవకాశాలుంటాయి. వీరు ఏ ఒక్క పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తుంటాయి.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2023 1:41 pm

Childhood Photo

Follow us on

Childhood Photo: నేటి కాలంలో పిల్లల ఫొటోలను దించుతూ వారి ఫ్రేమ్ ను కట్టించుకుంటున్నారు. మరికొందరు బర్త్ డే సెలబ్రేషన్స్ రోజు స్పెషల్ ఫొటో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ పురాతన కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. చిన్నపాటి కెమెరా మాత్రమే ఉండేది. దానితోనే చాలా మంది ఫొటోలు తీసుకొని వాటిని దాచుకునేవారు. అయితే వాటిని ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఇలా బయటపెడుతున్న వారిలో సినీ సెలబ్రెటీలు ఎక్కువ మంది ఉన్నారు. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఓ పాప ఫొటో ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా.

సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో హీరోయిన్లకు చాలా అవకాశాలుంటాయి. వీరు ఏ ఒక్క పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తుంటాయి. అలా తమిళ సినిమాల్లో అడుగుపెట్టిన ఆసిన్ కు తెలుగులోనూ గుర్తింపు వచ్చింది. ఇక్క చాలా సినిమాల్లో నటించి అలరించింది. తెలుగులో ‘అమ్మానాన్న ఓ తతమిళ అమ్మాయి’ అనే తెలుగు సినిమాతో పరిచయం అయిన ఈమె అంతకుముందే తమిళ సినిమాల్లో మెరిసింది.

ఆసిన్ 1985 అక్టోబర్ 26న కేరళ లోని కొచ్చిలో జన్మించారు. ఈమె చదువుకునే రోజుల్లోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. తాను 15 ఏళ్ల వయసులో ఉండగా 2001లో నరేంద్రన్ మాకెన్ జయకాంతన్ వక అనే మలయాళ సినిమాలో నటించింది. ఆ తరువాత పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన తెలుగు సినిమా ‘అమ్మానాన్న ఓ తతమిళ అమ్మాయి’లో నటించింది. ఆ తరువాత రెండో సినిమా స్టార్ హీరో నాగార్జున పక్కన చేయడంతో అమ్మడుకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇలా కొన్నాళ్ల పాటు తెలుగు, తమిళం సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆసిన్ 2016లో రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు. భర్తతో పాటు వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆమె మళ్లీ సినిమాల్లో నటించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె లేటేస్ట్ పిక్స్ అప్డేట్ చేస్తూ ఉంటోంది. లేటేస్టుగా ఆమె చిన్న నాటి ఫొటో ఒకటి వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.