https://oktelugu.com/

Fahad Fazil : పుష్ప 2′ లో నటించినందుకు ఫహాద్ ఫాజిల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

'పుష్ప' చిత్రం విడుదల సమయంలో ఉన్న ఫహద్ కి, ఇప్పుడు ఉన్న ఫహద్ కి చాలా తేడా ఉంది. అప్పటికే ఫహద్ ఫాజిల్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా చలామణి అవుతున్నాడు. ఈ మూడేళ్ళ గ్యాప్ లో ఆయన స్టార్ స్టేటస్ చాలా పెరిగింది. మలయాళం లో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 09:10 PM IST

    Fahad Fazil

    Follow us on

    Fahad Fazil : సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఫహద్ ఫాజిల్. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఫహద్ ఫాజిల్ అంటే తెలుగు వాళ్లకు కూడా ఇష్టమే. ఈయన తెలుగు లో ‘పుష్ప’ చిత్రం తో మన ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఆయన కనిపించేది కేవలం 20 నిమిషాలే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. డైరెక్టర్ సుకుమార్ ఆయనలోని టాలెంట్ ని మొత్తం ఆ 20 నిమిషాల్లోనే పిండుకున్నాడు. అయితే ‘పుష్ప’ చిత్రం విడుదల సమయంలో ఉన్న ఫహద్ కి, ఇప్పుడు ఉన్న ఫహద్ కి చాలా తేడా ఉంది. అప్పటికే ఫహద్ ఫాజిల్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా చలామణి అవుతున్నాడు. ఈ మూడేళ్ళ గ్యాప్ లో ఆయన స్టార్ స్టేటస్ చాలా పెరిగింది. మలయాళం లో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించాడు.

    కేవలం హీరో గా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషించి ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కమల్ హాసన్ హీరో గా నటించిన ‘విక్రమ్’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో కమల్ హాసన్ కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఫహద్ ఫాజిల్ కి దక్కింది. అమర్ క్యారక్టర్ లో ఆయన జీవించేసాడు. ఈ చిత్రం తర్వాత కొన్నాళ్ళకు ఆయన చేసిన ఆవేశం చిత్రం మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసింది. సుమారుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఫహద్ ఫాజిల్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. కేవలం థియేట్రికల్ పరంగా మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. బాలయ్య, లేదా రవితేజ ఈ సినిమాని రీమేక్ చేయొచ్చు. అలా ఈ మూడేళ్ళ గ్యాప్ లో ఫహద్ ఫాజిల్ గ్రాఫ్ ఈ ఒక స్టార్ గా ఈ రేంజ్ లో పెరిగింది. అందుకే ‘పుష్ప 2’ చిత్రానికి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఫహద్ డేట్స్ కోసం నిర్మాతలు ఒక యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. చాలా కాలం వరకు ఆయన డేట్స్ లేకపోవడంతో షూటింగ్ ని ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత డిమాండ్ ఉన్న ఫహద్ ఫాజిల్ కి దాదాపుగా 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారట మేకర్స్. ఇది ఫహద్ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు లో ఈయన కూడా ధనుష్, దుల్కర్ సల్మాన్ లాగా సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.