spot_img
Homeఎంటర్టైన్మెంట్Childhood Photo: ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సొంతంగా కష్టపడకపోతే ఈ రోజుల్లో ఎవరూ రాణించరు. అందుకే చాలా మంది తండ్రులు, బంధువులు తమకు సంబంధించిన వారిని ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయం చేసినా యాక్టింగ్ ను భట్టే హీరోకు గుర్తింపు నిస్తున్నారు ప్రేక్షకులు. అలా ఓ హీరో తండ్రి అండదండలతో సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో కాస్తా నార్మల్ హీరో అనిపించుకున్నా… ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకుంటున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, ఎమోషన్ ఇలా అన్ని రకాలుగా నటిస్తున్న ఆ హీరోకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ఎవరిదో తెలుసుకున్న తరువాత ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ బాలుడు ఎవరో కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ అనే నిక్ నేమ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ స్టార్ హీరోగా మారాడు. బన్నీకి తెలుగులోనే కాకుండా కేరళలోనూ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండడం విశేషం. ఆయన నటించిన లేటేస్ట్ మూవీ ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ కావడంతో దాని సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు సీరియస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది థియేటర్లోకి ఎప్పుడు వస్తుందా? అని ఈగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

‘గంగొత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ను మొదట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్య’తో తన లైఫ్ టర్న్ అయింది. అక్కడి నుంచి బన్నీకి దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. కథ ఎలా ఉన్నా అందులో ఇమిడిపోయి నటించడం అల్లు అర్జున్ స్టైల్. తాత అల్లు అరామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ అండదండలతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ బన్నీకి ఇప్పుడు సొంత ఇమేజ్ ఉంది. మొన్నటి వరకు సౌత్ స్టార్ గానే కొనసాగిన ఆయన సినిమాల కోసం ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఎదురుచూస్తున్నారు.

ఇక లేటేస్టుగా ఆయన నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ పూర్తి దశలోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కాళీ మాతలో బన్నీ అవతారం చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతున్నారు. మొదటి పార్టుకు, రెండో పార్టు కు చాలా సమయం తీసుకోవడంతో సినిమా పై హోప్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో మరో మూవీ కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. వీరి కాంబినేషన్లో గతంలో ‘జులాయి’ వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version