Ramya Raghupathi- Naresh: రమ్య రఘుపతి-నరేష్ ల వివాదంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రమ్య రఘుపతి ఆయనపై పలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో… నరేష్ కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. రమ్య తనను చంపేందుకు కుట్ర పన్నిందంటూ కోర్టుని ఆశ్రయించారు. రమ్య తన వద్ద నుండి కోట్ల రూపాయలు కాజేసేందుకు చూస్తుందని పరోక్షంగా ఆయన విమర్శించారు. అలాగే రమ్య రఘుపతి చంపేందుకు స్కెచ్ వేసింది. దీని కోసం కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ తో డీల్ కుదుర్చుకుందని అంటున్నారు. నరేష్ మాట్లాడుతూ… నన్ను చంపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. నా ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు.

అలాగే ఓ పోలీస్ అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతని సహాయంతో రమ్య నా ఫోన్ ట్యాప్ చేయించింది. రూ. 10 కోట్లు ఇస్తే నేను ఇవ్వన్నీ వదిలేస్తా అని మధ్యవర్తులను పంపుతుంది. తన పెదనాన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరు చెప్పి బెదిరింపులకు దిగుతుంది. పెళ్ళైన మొదటి రోజు నుండే రమ్య నన్న వేధిస్తుందంటూ కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నరేష్ కామెంట్స్ టాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. కాగా వరుస ఇంటర్వ్యూలలో రమ్య రఘుపతి భర్త నరేష్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు.
నరేష్ ఉమనైజర్, నీలి చిత్రాలు చూస్తాడు. అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్స్ నడిపారు. నరేష్ వ్యవహారాలు అమ్మ విజయనిర్మలకు కూడా తెలుసు. ఎప్పటికైనా మారతాడు అంటూ ఆమె నాకు నచ్చజెప్పేవారు. విజయనిర్మల మరణంతో నరేష్ కి చెప్పేవారు లేకుండా పోయారు. నన్ను వదిలించుకునేందుకు ఎఫైర్స్ అంటగట్టారు. చివరకు కృష్ణతో నేను ఎఫైర్ పెట్టుకున్నానే దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని జరిగినా నా కొడుకు కోసం నరేష్ కావాలి అనుకుంటున్నానని రమ్య పలు ఆరోపణలు చేశారు.

రమ్య ఆరోపణలపై మౌనం వహించిన నరేష్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రమ్య టార్గెట్ గా కొత్త అస్త్రాలు సంధించాడు. ఏకంగా రమ్య తనకు చంపేందుకు కుట్ర పన్నుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో పిటిషన్ వేశాడు. కాగా కొన్నాళ్లుగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. మూడో భార్య అయిన రమ్య రఘుపతికి ఆయన విడాకులు ఇవ్వలేదు. 2022 డిసెంబర్ 31న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీనికి స్పందనగా రమ్య వారి పెళ్లి జరగనివ్వనని శబధం చేస్తున్నారు.