Daughters Of Heroes: సినిమా పరిశ్రమలో వారసులతో పాటు వారసురాళ్లు కూడా ఉన్నారు. తమ బిడ్డలతో సినిమాలు చేస్తూ ఎందరో వారి పిల్లల ఆశయాలు తీరుస్తున్నారు. కొడుకులే కాదు కూతుళ్లకు కూడా సమాన హక్కులున్నాయనే ఉద్దేశంతోనే వారి కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కొడుకులకైతేనే అవకాశాలా కూతుళ్లకు కూడా ఉండాల్సిందేననే లక్ష్యంతో సినిమాల్లో తమ కూతుళ్లకు కూడా సరైన అవకాశాలు ఇస్తూ వారిని కూడా నటనలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా వారు నటనలో జీవిస్తూ తమ కన్న వారి కలలను తీరుస్తున్నారు.
రజనీకాంత్ కు ఇద్దరు కూతుళ్లు. అందులో ఒకరు దర్శకురాలుగా మారి తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారు. ఇక మెగాస్టార్ కుటుంబం నుంచి నిహారిక హరోయిన్ గా తన ప్రస్థానం కొనసాగించిన విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ కూతుళ్లు కూడా శివాని, శివాత్మిక ఇద్దరు సినిమాల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హీరోయిన్టుగా చలామణి అయ్యేందుకు తమ శాయిశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Allu Arjun Pushpa 2: సుకుమార్ కూడా అదే చేస్తే… కెజిఎఫ్ కి పుష్పకి తేడా ఏముంది?
ఇక కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా మంచి స్థానంలోనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూతురు కూడా ఫ్యాషన్ డిజైనర్ గా మారి చిరంజీవికే క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుండటం విశేషం. ఖైదీనెంబర్ 150 కి ఆమె ఫ్యాషన్ డిజైనర్ కావడం తెలిసిందే. దీంతో వారసురాళ్ల నైపుణ్యాలు కూడా సినిమాల్లో పెడుతుండటంతో వారసులతో పాటు వారసురాళ్లకు కూడా సమ ప్రాధాన్యం దక్కుతోంది. దీంతో వారు సినిమా రంగాన్ని తమదైన శైలిలో నడిపిస్తున్నారు.
మోహన్ బాబు తనయ లక్ష్మీప్రసన్న కూడా నిర్మాతగా నటిగా రాణిస్తోంది. పలు చిత్రాల్లో ఆమె మంచి పాత్రలు చేసి తానేమిటో నిరూపించుకుంటోంది. మంజుల విజయ్ కుమార్ కూతుళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. శరత్ కుమార్ రాధిక కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమాల్లో రాణిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు సారా కూడా నటిస్తోంది. ఇక్కక కొడుకులే కాదు కూతుళ్లు కూడా తమ సహజమైన నటనతో ముందుకు వెళ్తున్నారు.
Also Read:Thalapathy 66: విజయ్ ఫ్యాన్స్ కి భారీ సర్పైజ్… తలపతి 66 నుండి ఫస్ట్ లుక్!