https://oktelugu.com/

Young Heroes: అక్కినేని వారసులను మించి పోతున్న ఈ యంగ్ హీరోలు…

నాగ చైతన్య, అఖిల్ విషయంలో ఇదే మైనస్ అవుతుంది. ఆ యంగ్ హీరోల విషయంలో మాత్రం ఇదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఇప్పటికైనా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా కొత్త కథలు చేస్తేనే సక్సెస్ లు సాధిస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2024 / 02:36 PM IST

    Young Heroes

    Follow us on

    Young Heroes: సినిమా ఇండస్ట్రీలో గత పది సంవత్సరాల కాలాన్ని కనక చూసుకున్నటైతే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం సక్సెస్ లు అందుకోవడం లో వెనకబడి పోయారు. అందుకే వాళ్ళు స్టార్ హీరో అనే రేంజ్ ని సంపాదించు కోలేకపోతున్నారు.

    ఇక వీళ్ళతో పోలిస్తే యంగ్ హీరోలైన నిఖిల్,నితిన్, అడివి శేషు లాంటి హీరోలు వరుసగా సక్సెస్ లను అందుకుంటూ వాళ్ల క్రేజ్ ని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక సక్సెస్ ల విషయంలో వీళ్లు అక్కినేని హీరోలను సైతం బీట్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ బడా ఫ్యామిలీ హీరోలకు రాకూడదని అభిమానులు సైతం నాగచైతన్య, అఖిల్ విషయంలో చాలా వరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిఖిల్, అడవి శేషు లాంటి హీరోలు మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుని సక్సెస్ లు సాధిస్తున్నారు.

    నాగ చైతన్య, అఖిల్ విషయంలో ఇదే మైనస్ అవుతుంది. ఆ యంగ్ హీరోల విషయంలో మాత్రం ఇదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఇప్పటికైనా నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా కొత్త కథలు చేస్తేనే సక్సెస్ లు సాధిస్తారు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమాలో హీరో ఎవరు అనే దానికంటే కూడా అందులో కంటెంట్ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.

    అందుకోసమే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ముందు దాని స్టోరీ అనేది ప్రాపర్ గా ఉండాలి, అందులో ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటే ఆ సినిమాలో హీరో ఎవరైనా కూడా సినిమా సక్సెస్ అవుతుందనేది ఇప్పటికీ చాలా సినిమాలు రుజువు చేశాయి. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఒక ఈగను పెట్టి సక్సెస్ కొట్టి 40 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు అంటే నార్మల్ విషయం కాదు. అలా కథలో కంటెంట్ ఉంటే ఆటోమేటిగ్గా సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇక ఇప్పటికైన అక్కినేని హీరోలు కంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తే బాగుంటుందంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్లకి సలహాలు ఇస్తున్నారు…