https://oktelugu.com/

Ravi Teja: రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటే సినిమానే క్యాన్సల్ చేసుకున్న ఆ స్టార్ హీరో…

వరుసగా ప్లాప్ సినిమాలు రావడంతో ఆయన మార్కెట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయిన కూడా రవితేజ తన రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గేదేలే అనే రేంజ్ లో భారీగా డిమాండ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

Written By: , Updated On : January 24, 2024 / 02:39 PM IST
Ravi Teja
Follow us on

Ravi Teja: కొంతమంది హీరోలు మొదట సక్సెస్ ఫుల్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ప్లాప్ లు రావడం తో వాళ్ళ మార్కెట్ బాగా డౌన్ అయిపోతుంది. అయినప్పటికీ వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలా రేంజ్ లోనే ఊహించుకుంటూ మార్కెట్ తక్కువగా ఉన్న కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఉంటారు.

ఇక ఇప్పుడు రవితేజ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయనకి వరుసగా ప్లాప్ సినిమాలు రావడంతో ఆయన మార్కెట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయిన కూడా రవితేజ తన రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గేదేలే అనే రేంజ్ లో భారీగా డిమాండ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి కొంత మంది ప్రొడ్యూసర్లు ముందుకు రావడం లేదనే టాక్ అయితే ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల ఆగిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఆ సినిమాకి నిర్మాతలుగా మైత్రి మూవీ మేకర్స్ వారు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఓవర్ బడ్జెట్ అవుతుండటం వల్ల ప్రొడ్యూసర్లు హీరో అయిన రవితేజని, డైరెక్టర్ అయిన గోపిచంద్ మలినేని రెమ్యూనరేషన్ కొంచెం తగ్గించుకోమని చెప్పారట. దానికి డైరెక్టర్ ఒప్పుకున్నప్పటికి, రవితేజ మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించుకునే ప్రసక్తి లేదు అంటూ చాలా మొండి గా చెప్పడం తో చేసేదేమీ లేక ఆ ప్రొడ్యూసర్లు ఈ సినిమాని ఆపేసినట్టు గా తెలియజేశారు. ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు అయితే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమా ఆగిపోవడంతో రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు.

ఇలా రవితేజ రెమ్యూనరేషన్ విషయం లో మొండి చేస్తూ కూర్చుంటే ఈయనతో స్టార్ డైరక్టర్లు సినిమా చేయడం కష్టమే అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు మన మార్కెట్ కంటే దాని బడ్జెట్ ఎక్కువైనప్పుడు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాకి వచ్చే ప్రాఫిట్ లో నుంచి ఎంతో కొంత తీసుకుంటాము ముందు అయితే సినిమా చేయండి అని చెప్పి సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టిన స్టార్ హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇక దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న రవితేజ కి ఈ విషయం తెలియంది కాదు కానీ తన రెమ్యూనషన్ ని తగ్గించుకోవడం తనకి ఇష్టం లేక ఆ సినిమానే వదిలేసుకున్నాడని తెలుస్తుంది…

ఇక ఇంతకు ముందు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రవితేజ ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కూడా సేమ్ ఇదే ప్రాబ్లం తో ఆగిపోయినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది రవితేజ నువ్వు ఇలా ఉంటే కష్టం సామి అంటూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు…