https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ తో పోటీ పెట్టుకుంటున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు…ఎవరికి నష్టం జరగబోతుంది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు వచ్చినప్పటికీ మెగాస్టార్ తనయుడి గా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కి మాత్రం ఎనలేని గుర్తింపు అయితే దక్కింది...

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2024 / 01:03 PM IST

    Ram Charan(5)

    Follow us on

    Ram Charan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా మారిపోయింది. కాబట్టి ఇండియాలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ మరే ఇండస్ట్రీకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఇలాంటి క్రమంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులందరూ పోటీ పడుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోల పట్ల పోటీ అనేది ఎక్కువగా ఉంది. ఇక రామ్ చరణ్ తో పోటీపడుతూ కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. నిజానికి రామ్ చరణ్ ‘ రంగస్థలం ‘ సినిమాతో తనలోని నటన ప్రతిభను పూర్తిగా బయటికి తీసి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. త్రిపుల్ ఆర్ సినిమాలో ఆయన నటనకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలైతే దక్కాయి. మరి ఇలాంటి స్టార్ హీరోతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.

    కానీ ఈ ముగ్గురిలో ఎవరు నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదుగుతారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతమైన డ్యాన్సులు, ఫైట్లు చేస్తూ నటనలో కూడా రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రామ్ చరణ్ తో వాళ్లు పోటీ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరి కంటే సినిమా ఇండస్ట్రీకి రామ్ చరణ్ కొంచెం లేటుగా ఎంట్రీ ఇచ్చాడు.

    అయినప్పటికీ తను చేసే సినిమాల ద్వారా భారీ గుర్తింపును సంపాదించుకుంటూ వాళ్ళకంటే ముందు స్థానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ రామ్ చరణ్ ను అందుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే రామ్ చరణ్ ని అందుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లో సినిమా థియేటర్లోకి రాబోతున్నారు.

    ఇక ఇప్పుడు రాబోయే ఈ మూడు సినిమాలతో ఎవరి సత్తా ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలియబోతుంది. మరి ఈ సినిమాలతో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు రామ్ చరణ్ మేనియాతో మ్యాచ్ అవుతారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…