https://oktelugu.com/

Heroines: ఈ హీరోయిన్స్ రూటే సపరేటు…ఇండస్ట్రీ లో వీళ్ళను టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు…

కొంతమంది హీరోయిన్లు మాత్రం వాళ్లకు నచ్చిన క్యారెక్టర్ దొరికితేనే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును పొందారు. ఆ నటీమణులు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : February 21, 2024 / 03:26 PM IST
    Follow us on

    Heroines:  సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్స్ ను కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం చేసి సినిమాల్లో అందాల ఆరబోతని ప్రదర్శించడానికి మాత్రమే వాళ్లని వాడుకుంటూ ఉంటారు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో ఎక్కువగా నడిస్తు ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం వాళ్లకు నచ్చిన క్యారెక్టర్ దొరికితేనే సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును పొందారు. ఆ నటీమణులు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    విజయశాంతి
    లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోలకు పోటీగా తన క్యారెక్టర్ ను డిజైన్ చేయించుకొని మరి సినిమాల్లో నటించేది. ఒకవేళ తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోతే మాత్రం తను సినిమాలను రిజెక్ట్ చేసేది. ఇక అందులో భాగంగానే ఆమె ఒసేయ్ రాములమ్మ లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి మంచి విజయాలను అందుకుంది…

    అనుష్క
    అనుష్క కూడా తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలని ఎక్కువగా చేస్తూ ముందుకు కదిలింది. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన కూడా తన కెరీయర్ ను బిల్డ్ చేసుకున్న తర్వాత తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని చెప్పి అలాంటి సబ్జెక్టులను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లింది…అందులో భాగంగానే ‘అరుంధతి ‘ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది…

    సాయి పల్లవి
    ఇక ఇప్పుడున్న హీరోయిన్లలో సాయి పల్లవి తన రూటే సపరేటు అన్నట్టుగా ముందుకు కదులుతుంది. డైరెక్టర్ తనకు స్క్రిప్ట్ మొత్తం చెప్పిన తర్వాత తన క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసుకొని, దాన్ని దర్శకుడు యాజ్ ఇట్ ఇజ్ గా ఇలాగే తీయగలడా లేదా అని ముందే అతనితో డిస్కస్ చేసి ఆ తర్వాత తన క్యారెక్టర్ ను ఒప్పుకొని సినిమాలు చేస్తుంది. అందువల్లే తనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అలాగే తన పాత్రలకు వచ్చే గుర్తింపు కూడా చాలా ప్రత్యేకంగా ఉందనే చెప్పాలి…

    ఇలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మొత్తానికైతే ఈ జనరేషన్ లో కూడా సాయి పల్లవి కేవలం తన పాత్రకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఎక్కడ వల్గారిటీ లేకుండా సినిమాలు చేయడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి…