https://oktelugu.com/

Star Heroines: 500 కోట్లకు పైగా సంపాదించి పెట్టారు… ఈ హీరోయిన్లు మామూలోళ్లు కారు..

అనుష్క గురించి ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇందులో కీ రోల్ పోషించి పార్ట్ 1, పార్ట్ 2 లకు మంచి కలెక్షన్లు అందించింది అనుష్క.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 1, 2023 / 01:39 PM IST

    Star Heroines

    Follow us on

    Star Heroines: సినిమా అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. డాన్సులు, డైలాగులు, కామెడీ ఇలా ఎన్నో అంశాలతో కూడుకొని ఉంటుంది సినిమా. ఇందులో ఏ ఒక్కటి లోపించినా కూడా దాని గురించే మాట్లాడుతుంటారు నెటిజన్లు. హీరోతో సమానంగా అన్ని పాత్రలు ఉండాలి. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అయితే ఇందులో మరీ ముఖ్యంగా హీరోతో పాటు హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంది. కేవలం హీరో వల్ల మాత్రమే కాకుండా హీరోయిన్ హిట్ రోల్ వల్ల ఇప్పటికీ ఇండస్ట్రీలో రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సూపర్ డూపర్ హీరోయిన్ లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం..

    అనుష్క: అనుష్క గురించి ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇందులో కీ రోల్ పోషించి పార్ట్ 1, పార్ట్ 2 లకు మంచి కలెక్షన్లు అందించింది అనుష్క. ఈ సినిమా కలెక్షన్లలో అనుష్క హస్తం కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటాయి.

    దీపికా పదుకొనె: పఠాన్ సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకుంది దీపికా. షారుఖ్ ఖాన్ తో జతకట్టి హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్న దీపికా యాక్షన్ సన్నివేశాలతో పాటు గ్లామర్ డోస్ ను కూడా పెంచింది. రెండింటి విషయంలో ఎక్కడ కూడా వెనుకాడలేదు దీపిక. ఇలా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ గా పేరు సంపాదించింది. అంతే కాదు అప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ కు పట్టిన దుమ్ము దులిపిందనే చెప్పాలి.

    నయనతార: దీపికా పదుకొనెను వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టిన హీరోయిన్ గా నిలబెట్టిన షారుఖ్ ఖాన్ నయనతారను కూడా అదే రేంజ్ లో నిలబెట్టారు. ఈ అమ్మడు నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు నయనకు సూపర్ రికార్డు దక్కేలా చేసింది.

    అమీషా పటేల్: సినిమా ఇండస్ట్రీలో అరకొర అవకాశాలు దక్కించుకున్న అమీషా పటేల్ కూడా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ లలో స్థానం సంపాదించింది. ఆమె నటించిన గదర్ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

    త్రిష: గత 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ త్రిష కూడా ఈ లిస్టులో చేరింది. ఈమె నటించిన లియో చిత్రం రూ. 500 కోట్ల క్లబ్ లో చేరి తన రేంజ్ ను పెంచుకుంది.