Tollywood Directors: ఈ ఇయర్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ కొట్టిన ఆ ఇద్దరు డైరెక్టర్లు వీళ్లే…

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్లను కొట్టి ఒక అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు... వాళ్ళు ఎవరు అంటే ఒకరు శ్రీకాంత్ ఓదెల కాగా, మరొకరు బలగం వేణు.

Written By: Gopi, Updated On : December 9, 2023 12:34 pm

Tollywood Directors:

Follow us on

Tollywood Directors:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ల కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ను చాటుకోవాలని డిఫరెంట్ కథలతో వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు.ఇక ఈ సంవత్సరం చాలా మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పటికీ ఒక ఇద్దరు కొత్త డైరెక్టర్లు మాత్రం వాళ్ళు తీసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్లను కొట్టి ఒక అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు… వాళ్ళు ఎవరు అంటే ఒకరు శ్రీకాంత్ ఓదెల కాగా, మరొకరు బలగం వేణు…

శ్రీకాంత్ ఓదెల
ఈ దర్శకుడు నానితో దసర అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలోని బొగ్గు గనులలో నివసించే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది.అక్కడ జరుగుతున్న కుట్రలు పెద్ద వర్గం వారు చిన్న వర్గం వారిని ఎలా హింసిస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో శ్రీకాంత్ ఓదెల కి ఫస్ట్ సినిమాతోనే అదృష్టం కలిసి వచ్చింది అంటూ చాలామంది విమర్శకులు సైతం అతన్ని ప్రశంసించారు.

ఇక ఇప్పుడు మళ్లీ నానితోనే మరో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నానికి కూడా అప్పటి వరకు లేని మాస్ ఇమేజ్ ని దసర సినిమాతో తీసుకు వచ్చి పెట్టాడు శ్రీకాంత్…ఇక ఈ సినిమాకి ముందు ఆయన సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు. అందువల్ల ఆయనకి నాని తో సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది. ఇక మొదటి సినిమాతోనే నాని లాంటి స్టార్ హీరోని పట్టుకొని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విధంగా ఆయన చాలా కష్టపడి దసర సినిమా చేసి సక్సెస్ కూడా కొట్టారు…

వేణు
బలగం సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు…అంతకు ముందు నటుడి గా చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వేణు డైరెక్షన్ కూడా చేస్తాడని ఎవరికి తెలియదు. కానీ తను డైరెక్షన్ చేసి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మనుషులు చనిపోయినప్పుడు వాళ్ల బందువులు ఎలా బీహేవ్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనే పాయింట్ తో తీసిన సినిమానే బలగం సినిమా…ఇక ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. అలాగే తన నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే నాని తో చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ కొడితే ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా ఆయనకి మంచి గుర్తింపు అయితే వస్తుంది….