Inter-Caste Marriages: భారతదేశంలో కులాలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుల రహిత సమాజం ఉండాలని ప్రతీ ఒక్కరు ఆకాంక్షిస్తుంటారు. కానీ, మనదేశంలో కులవ్యవస్థ వేళ్లూనుకుపోయింది. సామాజిక వర్గాల సమీకరణాలు నేడు కంపల్సరీ అయిపోయాయి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఎంత అభివృద్ధి చెందినప్పటికీ పెళ్లి విషయంలో వధువు కాని వరుడు కాని తమ సామాజిక వర్గం వారే అయి ఉండాలని పట్టుపడుతుంటారు. కాగా, ఈ సినీ తారలు మాత్రం కులం విషయం లెక్క చేయకుండా కులాంతర వివాహం చేసుకుని తమ అభిమానులకే కాదు.. ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. వారు ఎవరో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు కేరాఫ్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమా తొలి జేమ్స్ బాండ్‌గా, కౌబాయ్‌గా తన మార్క్ చూపిస్తున్న టైంలో ఈయన విజయనిర్మలను పెళ్లి చేసుకుని సంచలన సృష్టించాడు. అయితే, కృష్ణకు అప్పటికే ఇందిరా దేవితో వివాహం అయింది. అయినా పెద్దల అంగీకారంతో కృష్ణ విజయనిర్మలను మ్యారేజ్ చేసుకున్నాడు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఏఎన్ఆర్ పేరు నిలబెట్టాడు. ఈయన తొలుత మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూతురు లక్ష్మీని మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ, వీరు తర్వాత డైవోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున.. ఉత్తరాదికి చెందిన మహిళ అయిన అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉత్తరాదికి చెందిన రేణుదేశాయ్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంతకు ముందు విశాఖ పట్నానికి చెందిన నందినిని పెళ్లి చేసుకున్న పవన్ .. ఆ తర్వాత ఆమెకు డైవోర్స్ ఇచ్చాడు.
రేణు దేశాయ్ ను మ్యారేజ్ చేసుకున్నా కొన్నాళ్లకు ఆమెకూ డైవోర్స్ ఇచ్చిన పవన్..విదేశీయురాలు అనగా..రష్యా పౌరురాలు అయిన అన్నా లెజ్నోవాను మ్యారేజ్ చేసుకున్నాడు. మహేశ్ బాబు కూడా ఉత్తరాదికి చెందిన నమ్రతా శిరోద్కర్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకన్నాడు. అల్లు అర్జున్ స్నేహరెడ్డిని మ్యారేజ్ చేసుకున్నాడు. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, మనోజ్ కొన్నాళ్లకు తన భార్య ప్రణతీరెడ్డికి డైవోర్స్ ఇచ్చాడు.