Hollywood Movies: ప్రపంచ వ్యాప్తం గా అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న సినీ అభిమానులు హాలీవుడ్ మూవీస్ ని చూస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నిజానికి హాలీవుడ్ మూవీస్ చాలా భాషల్లో రిలీజ్ అవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమం లోనే ఇండియాలో హాలీవుడ్ మూవీస్ కి చాలా మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ సినిమాలు భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఆ సినిమాల్లో హీరోలుగా చేసిన వాళ్ళకి ఇక్కడి ప్రేక్షకులు చాలామంది అభిమానులుగా కూడా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో మొదటి రోజు అత్యధికంగా వసూళ్లను సాధించిన టాప్ 3 హాలీవుడ్ మూవీస్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
అవెంజర్స్ ఎండ్ గేమ్
అవెంజర్స్ సిరీస్ లో భాగంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 53 కోట్ల కలెక్షన్స్ రాబట్టి హాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా గుర్తింపు పొందింది…
అవతార్ 2
ఇక అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది అవతార్ 2 అనే చెప్పాలి…గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా జేమ్స్ కామెరూన్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రపంచం లో ఉన్న చాలా భాషల్లో రిలీజై భారీ సక్సెస్ ని సాధించినప్పటికీ ఇండియాలో మొదటి రోజు 45 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఈ సినిమా ఇండియా లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండోవ సినిమాగా కొనసాగుతుంది. నిజానికి ‘జేమ్స్ కామెరూన్’ తీసిన విధానం గాని ఆయన రాసుకున్న కథ గాని చాలా హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి…
అవతార్
ఇక ఈ లిస్టులో నెంబర్ 3 పొజిషన్ లో కొనసాగుతున్న సినిమా ఏది అంటే అవతార్ అనే చెప్పాలి. అయితే అవతార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండియాలో ఈ సినిమా కల్ట్ క్లాసికల్ గా కూడా చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక టైటానిక్ తర్వాత జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన దృశ్య కావ్యం గా అభిమానులు ఈ సినిమాని ఆదరించారు. ఇక ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో 41 కోట్ల కలెక్షన్లను రాబట్టింది…