Tollywood Celebrities: సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం గురించి తెలిసిందే. ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్లారు. అది ఇప్పుడు ఏ స్థాయిలో డ్యామేజ్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పుష్ప పాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేసిన కానీ. సంతోషం లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఆ కేసు కోర్డ్ లో ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో బన్నీ వివాదం వల్ల తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడం లేదు.
సామాన్యుల వివాదాలు బయటకు రాకపోతే సెలబ్రిటీల వివాదాలు మాత్రం ఫాస్ట్ గా తెర మీదకు వస్తుంటాయి. కానీ సెలబ్రిటీల వివాదాలంటే.. ఆ రచ్చ అంతా ఇంతా ఉండదు. అందరి ఇంట్రెస్ట్ దానిపైనే ఉంటుంది. ఏం జరుగుతుందా అని జనాలు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మంచు వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు నాలుగు గోడల మధ్య ఉన్నంత కాలం ఎవరు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు గేటు దాటి మంచు కుటుంబం వీధిన పడింది.
ఇక మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం, మనోజ్, మోహన్ బాబు పరస్పర విమర్శలు చేయడం వంటివి జరగడంతో పోలీసులకు ఇద్దరు ఒకరిపై మరొకరు కంప్లైయింట్ చేసుకున్నారు. అందుకే మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఈ విషయంలో కేసులు ఎదుర్కొన్నారు. మరి వీరి వివాదానికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో.
ఈ సంవత్సరం కేసులో ఇరుక్కున్న మరో సెలబ్రిటీ జానీ మాస్టర్. సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది ఈ కేసు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా, జనసేన నాయకుడిగా, జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు. అయితే ఒక్క సారిగా వివాదంలో చిక్కుకోవడంతో పాటు.. కెరీర్ ను కూడా పోగోట్టుకున్నాడు. అయితే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న ఓ అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని, తనని ట్రాప్ చేసాడని కేసు పెట్టింది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. ఇదంతా కావాలనే ఎవరో చేశారు అనే టాక్ ఉంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.
రాజ్ తరుణ్ మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఓ సారి కారు యాక్సిడెంట్ చేసి పారిపోవడం… అది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడం వల్ల పరువు పోయింది. ఇక ఈ సంవత్సరం రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇది ఇండస్ట్రీని కుదిపేసిన టాపిక్ అని చెప్పవచ్చు. యంగ్ హీరోగా మంచి పేరున్న రాజ్ తరుణ్ లో ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అతనికి లవర్ బాయ్ అనే పేరు కూడా వచ్చింది. ఈ పేరే అతనికి తిప్పలు తెచ్చింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ టాపిక్ పెద్ద రచ్చరచ్చ అయింది. తాను గర్భవతి అయిందని చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని తనని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని చెప్పింది లావణ్య. కొన్ని రోజులు హాట్ టాపిక్ గా ఉండి తర్వాత కూల్ అయింది.